ముగ్గురు పిల్లలున్న నటికి పెళ్లి ప్రపోజల్‌.. ఇల్లరికమైనా ఓకే అంటూ..

Published on Fri, 04/07/2023 - 17:00

హీరోయిన్ల అందచందాలను చూసి మంత్రముగ్ధులవుతుంటారు అబ్బాయిలు. వారి ఫోటోలను వాల్‌పేపర్లుగా పెట్టుకుని మురిసిపోయేవారు కొందరైతే సెల్ఫీలు దిగి షేర్లు చేసేవారు మరికొందరు. అయితే కొద్దిమంది మాత్రం సదరు హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో అని పట్టపగలే కలలు కంటూ ఊహల్లో తేలిపోతుంటారు. తాజాగా ఓ నెటిజన్‌ కూడా అదే ఊహలో మునిగిపోయాడు. బాలీవుడ్‌ నటి, మోడల్‌ సెలీనా జైట్లీ తనకు భార్య అయితే ఎంత బాగుంటుందోనని కలలు కన్నాడు. అక్కడితో ఆగకుండా ఆమెకు ప్రపోజ్‌ చేశాడు.

'సెలీనా జైట్లీ.. నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు. నా ఆరోగ్యం మరింత దిగజారకముందే నీతో నన్ను తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకో. నీతో జీవితం పంచుకోవడానికి ఇల్లరికం రావడానికి కూడా నేను సిద్ధమే! నా ప్రపోజల్‌కు స్పందిస్తావని ఎదురుచూస్తున్నాను. ఇట్లు కోల్‌కతా నుంచి విజయ్‌ మగన్‌లాల్‌ వోరా' అని ట్వీట్‌ చేశాడు. ఇది చూసిన సెలీనా వెరైటీగా రిప్లై ఇచ్చింది. 'నా భర్తను, ముగ్గురు పిల్లలను అడిగాక వస్తాను' అంటూ తెలివిగా బదులిచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా మిస్‌ యూనివర్స్‌ 2003 రన్నరప్‌గా నిలిచిన సెలీనా జైట్లీ ఆస్ట్రేలియాకు చెందిన ఎంటర్‌ప్రెన్యూర్‌ పీటర్‌ను పెళ్లాడింది. వీరికి 11 ఏళ్ల కవలలు విన్‌స్టన్‌, విరాజ్‌తో పాటు ఐదేళ్ల ఆర్థూర్‌ సంతానం. ఇకపోతే మోడల్‌గా సత్తా చాటిన సెలీనా 2003లో 'జనాషీన్‌' సినిమాతో వెండితెరపై తన లక్‌ పరీక్షించుకుంది. నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, గోల్‌మాల్‌ రిటర్న్స్‌ సినిమాల్లో మెరిసింది.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)