Breaking News

'తీవ్ర మానసిక వేదన అనుభవించా'.. విదేశీ భర్తపై నటి ఫిర్యాదు.!

Published on Tue, 11/25/2025 - 15:54

బాలీవుడ్ నటి, హీరోయిన్ సెలీనా జైట్లీ కోర్టును ఆశ్రయించారు. తన భర్త వేధింపులకు గురి చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. తనపై గృహ హింసకు పాల్పడ్డారని భర్త పీటర్ హాగ్పై ముంబయిలోని అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన వేధింపులతో తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడికి గురైనట్లు కోర్టుకు తెలిపారు. అతని వేధింపుల కారణంగా సైకోవెజిటేటివ్ ఓవర్‌లోడ్తో బాధపడుతున్నట్లు ప్రస్తావించారు. దాదాపు పెళ్లయిన 15 ఏళ్ల తర్వాత భర్త పీటర్ హాగ్పై గృహ హింస కేసు పెట్టడం గమనార్హం. దీంతో ఆమె పిటిషన్‌ను విచారించిన కోర్టు డిసెంబర్ 12 లోపు కోర్టు ముందు హాజరు కావాలని హాగ్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే గత వారంలోనే తన భర్త హాగ్‌పై గృహ హింస పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది.

కాగా.. బాలీవుడ్ భామ సెలీనా జైట్లీ.. పీటర్హాగ్ను సెప్టెంబర్ 2010లో వివాహం చేసుకున్నారు. జంటకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా భర్త హాగ్ తనను మానసిక, శారీరక హింసకు గురి చేశారని ఆరోపించింది. 2019 తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యాయాని పిటిషన్లో పేర్కొంది. తన ఆస్తులు, ఆర్థిక నియంత్రణ అతని చేతికి అప్పగించాలని ఒత్తిడి తెచ్చాడని ఆరోపించింది.

నా బిడ్డ, తల్లిదండ్రులు కొన్ని నెలల వ్యవధిలో మరణించిన తర్వాత ముంబయిలోని తన నివాసాన్ని అతని పేరిట మార్చాలని తీవ్ర ఒత్తిడి చేశారని పిటిషన్లో వివరించింది. అయితే అంతకుముందే సెలీనా జైట్లీ జనవరి 14, 2019న తాను రాసిచ్చిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేయాలని బాంబే సిటీ సివిల్ కోర్టులో దావా వేశారు. కాగా.. గతంలో ఆమె పీటర్‌కు ఉమ్మడి ఇంటి ఆస్తిని బహుమతిగా ఇచ్చింది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)