Breaking News

సుందర్ సీ సినిమాలో గ్లామర్‌తో దుమ్మురేపిన 'కేథ‌రిన్ థ్రెసా'

Published on Tue, 04/15/2025 - 07:03

సినిమా ఏదైనా సరే స్పెషల్‌ సాంగ్స్‌ ప్రాముఖ్యత ఎక్కువగానే ఉంటుంది. ఈ తరహ పాటలకు ప్రేక్షకులకు ముఖ్యంగా యువతలో మంచి ఆదరణ లభించడమే ఇందుకు కారణం. కాగా కోలీవుడ్‌లో దర్శకుడు సుందర్‌.సీ చిత్రాల్లో ఐటమ్‌ సాంగ్‌ తప్పనిసరిగా ఉంటుందని అభిమానులు ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. అదే విధంగా ఆయన ఈ తరహా పాటల్లో గ్లామర్‌ మోతాదును కాస్త పెంచుతారు. ఇటీవల ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన అరణ్మణై 4 చిత్రంలో నటి తమన్నా, రాశీఖన్నాలతో అచ్చచ్చో అనే పాటకు వారి గ్లామర్‌ను బాగా వాడుకున్నారు. ఆ చిత్రం ప్రమోషన్‌కు ఆ పాట బాగా ఉపయోగపడింది కూడా. 

తాజాగా ఈ దర్శకుడు మరో హాస్య నటుడు వడివేలుతో కలిసి నటిస్తున్న చిత్రం గ్యాంగర్స్‌. వీరిది హిట్‌ కాంబినేషన్‌ అన్నది గమనార్హం. ఇంతకు ముందు వీరిద్దరూ కలిసి నటించిన పలు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే సుందర్‌.సీ, వడివేలుల మధ్య మనస్పర్థలు కారణంగా కలిసి నటించి చాలా కాలం అయ్యింది. అలాంటిది 15 ఏళ్ల తరువాత వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం గ్యాంగర్స్‌. వినోదభరిత కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 24వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా ఇందులో వడివేలు సింగారన్‌ అనే పాత్రలో నటించారు. అదే విధంగా సుందర్‌.సీ తన భాణిలో ఈ చిత్రంలోనూ ఒక ప్రత్యేక పాటను పొందుపరిచారు. ఈ పాటలో నటి కేథ‌రిన్ థ్రెసాను(Catherine Tresa) ఆ పాటలో నటింపజేశారు. 

కోలీవుడ్‌లో మెడ్రాస్‌ చిత్రంతో కథానాయకిగా పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించారు. కొన్ని తెలుగు చిత్రాల్లోనూ నటించారు. అయితే కారణాలేమైనా ఈమె కోలీవుడ్‌లో నటించి చాలా కాలమే అయ్యింది. అలాంటిది చాలా గ్యాప్‌ తరువాత గ్యాంగర్స్‌ చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌తో సందడి చేశారు. ఈ పాటను చిత్ర వర్గాలు ఇటీవల విడుదల చేయగా కుర్రకారు నుంచి విశేష ఆదరణను అందుకుంటోంది. మరి గ్యాంగర్స్‌ చిత్రానికి ఈ పాట ఏమాత్రం ఉపయోగపడుతుందో తెలియాల్సి ఉంది.
 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)