Breaking News

చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. కేసు నమోదు చేసిన పోలీసులు!

Published on Thu, 07/13/2023 - 12:10

ప్రముఖ కోలీవుడ్ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే నటి మహాలక్ష్మి శంకర్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి  తర్వాత ఎక్కువగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. పెళ్లి విషయంలో చాలా మంది ట్రోల్స్‌ చేశారు కూడా. మహాలక్ష్మి డబ్బు కోసమే నిర్మాతను రెండో పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. దీనిపై స్వయంగా మహాలక్ష్మి క్లారిటీ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. అయితే ట్రోల్స్‌ను ఈ జంట పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా మరోసారి రవీందర్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయారు. నిర్మాత రవీందర్ మరోసారి చిక్కుల్లో పడ్డారు.

(ఇది చదవండి: ఎక్కువ మంది చూసిన ఇండియన్‌ సినిమా ఇదే! బాహుబలి, దంగల్‌ కాదు!)

రవీందర్ చంద్రశేఖరన్ తమిళంలో చాలా సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం రవీందర్  ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో చెన్నైలో రవీందర్‌పై కేసు నమోదైంది. దాదాపు రూ.15 లక్షలు తీసుకుని స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.  

అసలేం జరిగిందంటే.. 

చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసుల సమాచారం ప్రకారం.. అమెరికాలో ఉంటున్న విజయ్ అనే వ్యక్తి రవీందర్‌తో కలిసి సినిమా నిర్మాణంలో భాగమయ్యాడు. ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెడుతుందని విజయ్‌కి రవీందర్ హామీ ఇచ్చారు. దీంతో  విజయ్ తన వాటాగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయితే సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా రవీందర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆన్‌లైన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో రవీందర్ చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో విచారణకు హాజరయ్యారు. 

(ఇది చదవండి: హీరో విజయ్‌ పొలిటికల్ ఎంట్రీ.. అప్పుడే గేమ్ మొదలెట్టారా?)

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?