Breaking News

నటిపై లైంగిక వేధింపులు.. నిర్మాతపై కేసు నమోదు!

Published on Tue, 06/20/2023 - 17:31

హిందీలో పాపులర్ షో అయినా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను కూడా సంపాదించుకుంది తారక్ మెహతా కా ఉల్టా చష్మా. అయితే ఈ షో నుంచి నటీనటులు ఒక్కొక్కరుగా వైదొలిగారు. గత కొద్దికాలంగా ఈ షో నిర్మాతలపై పెద్దఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ షోలో నటించిన మోనికా భదోరియా, ప్రియా అహుజా, శైలేష్ లోధా, దిశా వకాని ఇప్పటికే గుడ్‌ బై చెప్పేశారు. ‍అయితే గతంలో నిర్మాతలు తనను లైంగిక వేధింపులకు గురి చేశారని మరో నటి జెన్నిఫర్ మిస్త్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: షో నుంచి తప్పుకున్న నటి.. నిర్మాతలపై సంచలన ఆరోపణలు!)

ఈ విషయంపై తాజాగా జెన్నిఫర్ మిస్త్రీ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెపై లైంగిక వేధింపులకు సంబంధించి ఇప్పటికే జెన్నిఫర్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. ఇవాళ ఉల్టా చష్మా షో నిర్మాత అలిత్ మోడీ, ఆపరేషన్స్ హెడ్ సోహైల్ రమణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత జతిన్ బజాజ్‌పై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. కాగా.. అసిత్ మోడీతో పాటు కొంతమంది నటీనటులపై జెన్నిఫర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

ఆరోపణలు నిరాధారం: అసిత్ మోడీ

తనపై జెన్నిఫర్ మిస్త్రీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని అసిత్ మోడీ కొట్టిపారేశారు. తన పరువు తీసేందుకు అలా చేస్తోందని .. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. పోలీసులు విచారణ తర్వాతే నిజాలు బయటకు వస్తాయని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. 

(ఇది  చదవండి: మహిళతో సహజీవనం.. లైవ్‌లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం!)

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)