Breaking News

'కెప్టెన్‌ మిల్లర్‌'లో ముఖ్యపాత్ర పోషిస్తున్న హీరోయిన్‌, ఇంతకాలం సీక్రెట్‌గా!

Published on Sun, 10/15/2023 - 12:19

హీరో ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో కెప్టెన్‌ మిల్లర్‌ ఒకటి. సత్యజ్యోతి ఫిలిమ్స్‌ పతాకంపై టీజీ త్యాగరాజన్‌ సమర్పణలో సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు. అరుణ్‌ మాదేశ్వరం దర్శకత్వం వహిస్తున్న ఇందులో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌, సందీప్‌కిషన్‌, జాన్‌ కొక్కెన్‌, అడ్వర్డ్‌ సోనెన్‌ బ్లిక్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సిద్ధార్థ నుని ఛాయాగ్రహణం, జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాత్మక కార్యక్రమాలు జరుపుకుంటున్న కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఒక యదార్థ సంఘటన అధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ధనుష్‌ శ్రీలంక LTTE రెబెల్‌గా నటిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్ర టీజర్‌ ఇటీవల విడుదలవగా మంచి స్పందన తెచ్చుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని కన్నడ భాషలోనూ అనువదించి విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఇందుకు ముఖ్య కారణం ఈ చిత్రంలో కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ ముఖ్యభూమిక పోషించడమే. ఈయన ఇటీవల విడుదలైన జైలర్‌ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే.

ఈ చిత్రం కర్ణాటకలోనూ మంచి వసూళ్లను రాబట్టింది. దీంతో ధనుష్‌ కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రాన్ని కూడా కన్నడ భాషలోకి అనువదించి విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరో విషయం ఏమిటంటే ఇందులో ఒక కీలకపాత్రను అతిథిబాలన్‌ పోషించినట్లు తాజా సమాచారం. కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రాన్ని రెండు భాగాలుగా చేయనున్నారు. రెండవ భాగంలో అతిథిబాలన్‌ పాత్ర చిత్రానికి కీలకంగా ఉంటుందని తెలిసింది. దీంతో ఈ పాత్రను ఇప్పటివరకు రహస్యంగా ఉంచారు. అయితే త్వరలో ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

చదవండి: పెళ్లి, విడాకులే కాదు ఆ బాధ ఇప్పటికీ ఉండిపోయింది: రేణు దేశాయ్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)