కాపీ కొట్టావ్‌.. చిలుక బ్యాగ్‌, ఊర్వశీ రౌతేలా లుక్‌పై ట్రోలింగ్‌!

Published on Wed, 05/14/2025 - 18:07

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి క్రమం తప్పకుండా హాజరయ్యే హీరోయిన్లలో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela) ఒకరు. ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌(Cannes 2025) ప్రారంభమైన తొలి రోజే సందడి చేసింది ఈ అందాల తార. మల్టీ కలర్‌ పొడవాటి గౌనుతో పాటు జుడిత్ లీబర్ డిజైన్ చేసిన చిలుక ఆకారంలోని క్రిస్టల్ ఎంబెడెడ్ క్లచ్ బ్యాగ్‌ను ధరించి..రెడ్‌ కార్పెట్‌పై హొలలొలికించింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. 

కొంతమంది నెటిజన్స్‌ ఊర్వశీ లుక్‌పై విమర్శలు చేస్తున్నారు. ఐశ్వర్యరాయ్‌ లుక్‌ని కాపీ కొట్టిందంటూ ఆమె లుక్‌ని ట్రోల్‌ చేస్తున్నారు. 2018లో ఐశ్వర్యరాయ్‌ కూడా ఇలాంటి డ్రెస్‌నే ధరించి కేన్స్‌ ఫెస్టివల్‌కు హాజరైయిందని, అంత కరిష్మా లేకున్నా ఊర్శశీ కూడా ఆమెను అనుకరించిందని కామెంట్‌ చేస్తున్నారు. మరికొందరు ఆమె ధరించిన డ్రెస్‌ అతిగా, విచిత్రంగా ఉందని, మేకప్‌ ఎక్కువైందని ట్రోల్‌ చేస్తున్నారు.

కేన్స్ ఫెస్టివల్‌ కోసం నిర్వాహకులు ప్రవేశపెట్టిన డ్రెస్ కోడ్ రూల్స్‌లో  అతిగా బహిర్గతమయ్యే దుస్తులను ధరించరాదని చెప్పినప్పటికీ, ఊర్వశీ లుక్ ఈ సరిహద్దులను పరీక్షించినట్లు కనిపించింది. ఆమె ధరించిన డ్రెస్‌ కంటే.. చేతిలో ఉన్న చిలుక బ్యాగ్‌ అందరిని ఆకట్టుకుంది.  దీని ధర సుమారు రూ.4 లక్షలు ఉంటుందట. గతంలో కూడా ఊర్వశీ ఇలా ఖరీదైన వస్తువులను, అభరణాలను ఫిల్మ్‌ పెస్టివల్‌లో ప్రదర్శించింది. 2023లో జరిగిన ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి రూ. 276 కోట్ల విలువ చేసే మొసలి నెక్లెస్‌ని ధరించింది. అప్పట్లో ఈ నెక్లెస్‌పై కూడా విమర్శలు వచ్చాయి. 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)