Breaking News

30 రోజుల్లోనే ‘కానిస్టేబుల్‌’..చాలా మంది ఫోన్లు చేశారు : కెమెరామెన్ వళి

Published on Wed, 10/15/2025 - 16:02

కానిస్టేబుల్’ చూసి ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఫోన్స్ చేశారు. 30 రోజుల్లోనే అంత క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చావా? అని పొగిడేస్తున్నారు. ఓ పెద్ద బ్యానర్ నుంచి కూడా కాల్ వచ్చింది. త్వరలోనే ప్రాజెక్ట్ చేద్దామని అన్నారు. ఇలా ‘కానిస్టేబుల్’కి మంచి స్పందన వస్తుండటం నాకు ఎంతో ఆనందంగా ఉందిఅన్నారు కెమెరామెన్షేక్హజాతరయ్య(వళి). కెమెరామెన్‌గా 25 ఏళ్లలో 78 చిత్రాలకు పైగా చేసిన అనుభవం ఉన్న ఆయన సెంట్‌గా ‘కానిస్టేబుల్’ అంటూ అందరి ముందుకు వచ్చారు. వరుణ్ సందేశ్ హీరోగా, మధులిక వారణాసి హీరోయిన్‌గా ఆర్యన్ సుభాష్ తెరకెక్కించిన ఈ చిత్రం రీసెంట్‌గా విడుదలైంది. ఈ క్రమంలో కెమెరామెన్ వళి మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..

మాది నెల్లూరు జిల్లా. మక్కెనవారిపాలెం గ్రామం. నేను ఈ ఇండస్ట్రీలోకి ఎగ్జిక్యూటివ్ మేనేజర్ నారాయణ గారి వల్లే వచ్చాను. ఆయనే నన్ను ఇలా కెమెరా డిపార్ట్మెంట్‌లో పనిలోకి పెట్టారు. అలా 25 ఏళ్ల క్రితం మొదలైన ఈ ప్రయాణంలో ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు పని చేశాను. దాదాపు 8 భాషల్లో పని చేశాను. హిందీ, మరాఠీ భాషల్లో తీసిన చిత్రాలకు అవార్డులు కూడా వచ్చాయి.

→ అరుంధతి, అన్నవరం, ఏక్ నిరంజన్, రగడ ఇలా ఎన్నో సినిమాలకు కెమెరా డిపార్ట్మెంట్‌లో పని చేశాను. నేను చిన్నతనం నుంచీ చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. ఆయన వల్లే ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆ తరువాత ‘అన్నవరం’లో పవన్ కళ్యాణ్‌ను చూశాను. కష్టపడితే పైకి వస్తామని ఆయన్ను చూశాక అర్థమైంది.

→ బలగం జగదీష్ ఓ సినిమాకు ఆర్టిస్ట్‌గా వచ్చారు. ఆ మూవీనికి నేను కెమెరామెన్‌గా పని చేశాను. అప్పుడు నా వర్కింగ్ స్టైల్ ఆయనకు నచ్చింది. మీతో కచ్చితంగా ఓ సినిమాను తీస్తాను అని అప్పుడు బలగం జగదీష్ అన్నారు.

→ జగదీష్ గారు ‘కానిస్టేబుల్’ కథను విన్న వెంటనే నా దగ్గరకు పంపారు. ఆర్యన్ సుభాష్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. కథ అద్భుతంగా ఉంది అని జగదీష్ గారికి చెప్పాను. అలా ఈ మూవీ జర్నీని స్టార్ట్ చేశాం.

→ వరుణ్ సందేశ్ గారు మాకు ఎంతో సహకరించారు. ఆయనతో వర్క్ చేస్తే సొంత ఫ్యామిలీ, బ్రదర్‌లా అనిపిస్తుంది. ఎక్కడా కూడా తన స్థాయిని ప్రదర్శించడు. సెట్‌లో అందరితో కలిసి మెలిసి ఉంటాడు. ఓ సారి షూటింగ్‌లో గాయమైనా కూడా రెస్ట్ తీసుకోకుండా పని చేశారు.

→ ప్రస్తుతం నేను రామ్ భీమన దర్శకత్వంలో ఓ మూవీని కమిట్ అయ్యాను. రామ్ పోతినేని హీరోగా వస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాకి కెమెరా డిపార్ట్మెంట్‌లో పని చేస్తున్నాను. ఇవి కాకుండా శివ ప్రసాద్ నిర్మాతగా ఓ చిత్రాన్ని ఈ నెలాఖరున ప్రారంభించనున్నాం.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)