20 నిమిషాల పాత్రకి 20 కోట్లట..పదేళ్లలోనూ ఫ్లాపులే ఎక్కువ!

Published on Thu, 05/29/2025 - 15:15

సినిమా రంగం ఎవరిని ఎప్పుడు నెత్తికి ఎక్కించుకుంటుందో ఎవరిని నేలకేసి కొడుతుందో అంచనా వేయడం అంత సులభం కాదు. అందుకు నిదర్శనంగా మన తెలుగు హీరోను చెప్పొచ్చు. వయసులో ఉన్నప్పుడు  ఉరకలేసే ఉత్సాహంతో ఫైట్లూ, డ్యాన్సులూ వేసినా సమకాలికులైన హీరోలపై సాధించలేకపోయిన పైచేయిని..సక్సెస్‌నూ వృద్ధాప్యంలో సాధిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు బాలకృష్ణ. ఇటవలి కాలంలో సీనియర్‌ నటుల్లో బాలకృష్ణ అందుకుంటున్న విజయాలు మరెవ్వరికీ సాధ్యం కావడం లేదనేది వాస్తవం. నిజానికి యుక్తవయసులో ఉండగా కూడా బాలయ్య ఇంత సందడి చేయలేదని చెప్పొచ్చు. వయసులో ఉండగా చేయలేకపోయిన యాడ్స్‌లో కూడా ఆయన ఇప్పుడు సత్తా చాటుతుండడం దీనికో నిదర్శనం.  

ఈ నేపధ్యంలో తాజాగా సినీరంగంలో హల్‌చల్‌ చేస్తున్న ఒక వార్త మరోసారి బాలకృష్ణ సరికొత్త స్టామినాను చాటి  చెబుతోంది. అదేమిటంటే జైలర్‌ 2 సినిమాలో అతిధి పాత్రలో బాలకృష్ణ కనిపించబోతున్నాడని, అందుకు గాను అత్యధిక పారితోషికం అందుకుంటున్నారని.. కేవలం 20 నిమిషాల నిడివి ఉండే పాత్ర కోసం బాలకృష్ణ ఏకంగా రూ.20కోట్లకు పైనే రెమ్యునరేషన్‌ ఇవ్వడానికి జైలర్‌2 నిర్మాతలు ఓకే అన్నారని తెలుస్తోంది. ఈ సమాచారం ఒక్కసారిగా టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీగా మారింది. ఒకప్పుడు అంటే దాదాపుగా ఒక పదేళ్ల క్రితం  డిక్టేటర్‌ వంటి సినిమాల్లో నటించే సమయంలో బాలకృష్ణ మొత్తం సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్‌ కూడా దాదాపుగా అంతే ఉంటుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఒక సినిమా మొత్తం కనిపించే  హీరోగా పదేళ్ల క్రితం తీసుకున్న పారితోషికాన్ని ఇప్పుడు కేవలం 20 నిమిషాల పాత్ర కోసం తీసుకుంటూ బాలకృస్ణ కొత్త రికార్డ్‌ సాధించారని చెప్పొచ్చు. 

మొదటి నుంచీ నిర్మాతలకు అందుబాటులో ఉండే హీరోగా బాలకృష్ణకు పేరుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా  పారితోషికం  రూపంలో నిర్మాతల నెత్తిన భారం మోపే వాడు కాదని అందుకే ఎన్ని ఫ్లాపులొచ్చినా బాలకృష్ణ చేతిలో సినిమాలు లేని పరిస్థితి ఎప్పుడూ లేదని అంటుంటారు. అంతెందుకు ఆయన రెమ్యునరేషన్‌ అమాంతం పెరిగిన ఈ పదేళ్లలో చూసుకున్నా... బాలకృష్ణ కెరీర్‌లో విజయాలకన్నా అపజయాలే ఎక్కువ.గత 2014లో లెజెండ్‌ తర్వాత లయన్, డిక్టేటర్, గౌతమ్‌ పుత్ర శాతకర్ణి, పైసా వసూల్, జై సింహా, కధానాయకుడు పార్ట్‌ 1, కధానాయకుడు పార్ట్‌ 2, రూలర్‌... వరకూ వరుస ప్లాఫులే. ఆ తర్వాత ‘అఖండ’తో మాత్రమే విజయాలు ప్రారంభమయ్యాయి. వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి, ఢాకూ మహరాజ్‌..లు హిట్స్‌గా నిలిచాయి.అంటే పదేళ్లలో 9 ఫ్లాపులు, 4 మాత్రమే విజయాలు. 

హిట్టయిన నాలుగింటిలోనూ  బాలకృష్ణ డ్యాన్సులు ఫైట్లు చేసే కుర్ర హీరోలా కాకుండా డైలాగులు  పేల్చడం, విలన్లను నరకడం వరకే పరిమితమైన వయసుకు తగ్గ పాత్రలు పోషించడం కూడా ఈ సినిమాల సక్సెస్‌కు కారణంగా చెప్పొచ్చు. ఏదేమైనా వచ్చే జూన్‌ 10వ తేదీతో 65ఏళ్లు నిండుతున్న బాలయ్య... రేపోమాపో యువహీరోగా తెరకెక్కనున్న తన కొడుకుతో పోటీపడే స్థాయిలో నిలవడం విశేషమే అని చెప్పాలి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)