Breaking News

జై భీమ్‌ డైరెక్టర్‌తో రజనీకాంత్‌ కొత్త సినిమా!

Published on Fri, 02/10/2023 - 09:04

వయసుకు, మనసుకు సంబంధం లేదంటారు. అయితే వయసుకు, నటనకు సంబంధం లేదని నిరూపిస్తున్నారు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ఈయన వయసు జస్ట్‌ ఏడు పదులే. చేసిన చిత్రాలు 170. ప్రస్తుతం 169, 170 చిత్రాల్లో నటిస్తున్నారు. 169వ చిత్రానికి నెల్సన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జైలర్‌ అనే టైటిల్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో రమ్యకృష్ణ, తమన్నా, మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్, కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌కుమార్, బాలీవుడ్‌ స్టార్‌ నటుడు జాకీష్రాఫ్, టాలీవుడ్‌ నటుడు సునీల్, తమిళ నటుడు యోగిబాబు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

రజనీకాంత్‌కు సంబంధించిన షూటింగ్‌ 70 శాతం పూర్తి అయినట్లు సమాచారం. రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు ప్రచారంలో ఉంది. అందులో ఒకటి జైలర్‌ పాత్ర. కాగా ఈ చిత్రాన్ని ఆగస్టులో తెరపైకి తీసుకురానున్నట్టు తాజా సమాచారం. ఇక 169వ చిత్రం విషయానికొస్తే దీని పేరు లాల్‌ సలాం. ఇందులో రజనీకాంత్‌ అతిథిగా ఒక పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపిస్తారు. విష్ణువిశాల్, విక్రాంత్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రజనీకాంత్‌ వారసురాలు ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్‌.రెహమాన్‌ సంగీతం అందిస్తున్న దీన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

ఇకపోతే రజనీకాంత్‌ 171వ చిత్రం కూడా ఖరారైనట్లు తాజా సమాచారం. దీనికి జై భీమ్‌ చిత్రం ఫేమ్‌ జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది జై భీమ్‌ చిత్రం మాదిరిగానే యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రజనీకాంత్‌ మరోసారి లాఠీ పట్టనున్నట్లు సమాచారం. ఇంతకుముందు అన్బుక్కు నాన్‌ అడిమై, కొడి పరక్కుదు, నాట్టుక్కు ఒరు నల్లవన్, పాండియన్‌ ఇటీవల దర్బార్‌ చిత్రాల్లో పోలీస్‌ అధికారిగా నటించారు. దీంతో మరోసారి పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాల్లో దర్శకుడు జ్ఞానవేల్‌ బిజీగా ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల టాక్‌. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

చదవండి: 10 ఏళ్ల తర్వాత కోలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్‌

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)