Breaking News

మెగాస్టార్‌కు సర్జరీ.. సినిమాలకు బ్రేక్‌?!

Published on Mon, 08/14/2023 - 11:53

మెగాస్టార్‌ చిరంజీవి మరో ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త గుప్పుమంది. గతంలో భుజానికి సంబంధించిన సమస్యలతో బాధపడ్డ ఆయన 2016లో కుడి, ఎడమ భుజాలకు ఆపరేషన్‌ చేయించుకున్నారు. కొంతకాలంగా ఆయన మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు ఆయన శస్త్ర చికిత్స చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారట! హైదరాబాద్‌లో కాకపోతే ఢిల్లీ లేదా బెంగళూరులో ఈ ఆపరేషన్‌ జరగవచ్చన్నది సమాచారం.

ఈ ఆపరేషన్‌ తర్వాత దాదాపు 2 నెలల పాటు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి విశ్రాంతి తీసుకోనున్నట్లు వినికిడి! సర్జరీ తర్వాత పూర్తిగా కోలుకున్నానే తదుపరి ప్రాజెక్ట్‌పై ఫోకస్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన భోళా శంకర్‌ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు నెగెటివ్‌ టాక్‌ రావడంతో వసూళ్ల సంఖ్య భారీగా పడిపోయింది. భోళా శంకర్‌ డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌ వల్లే చిరంజీవికి ఇటువంటి ఫ్లాప్‌ వచ్చిందని ప్రేక్షకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

మరోవైపు మెగాస్టార్‌ మలయాళ హిట్‌ మూవీ బ్రో డాడీ రీమేక్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే!  బంగార్రాజు ఫేమ్ కల్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇది ఇంకా పట్టాలెక్కలేదు. ఇకపోతే బింబిసార డైరెక్టర్‌ వశిష్టతో చిరు ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ఫైనలవుతుందో? ఏది చిరుకు విజయాన్ని బహుమతిగా ఇస్తుందో చూడాలి!

చదవండి: భోళా ఎఫెక్ట్‌.. నిర్మాతతో చిరు గొడవ? ఏం జరిగిందో చెప్పిన బేబి డైరెక్టర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)