Breaking News

బంధం ముగిసింది.. విడిపోయిన బాలీవుడ్‌ స్టార్‌ జంట!

Published on Fri, 05/31/2024 - 14:03

బాలీవుడ్‌లో ఓ స్టార్‌ జంట బ్రేకప్‌ చెప్పుకుందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఏళ్ల తరబడి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న మలైకా అరోరా- అర్జున్‌ కపూర్‌ ఎవరి దారి వారు చూసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఈ లవ్‌ బర్డ్స్‌ ఇంతవరకు స్పందించలేదు. వారి బంధానికి కాలపరిమితి ముగిసిందని, అందుకే విడిపోయారని పలువురూ భావిస్తున్నారు. 

మనసులో స్థానం అలాగే..
జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఇండస్ట్రీలోని ఓ వ్యక్తి ఈ బ్రేకప్‌పై స్పందిస్తూ.. మలైకా, అర్జున్‌ల మధ్య ఎంతో అనుబంధం ఉంది. బ్రేకప్‌ తర్వాత కూడా వారు దాన్ని కొనసాగిస్తారు. ఒకరి మనసులో ఒకరికి ప్రత్యేక స్థానం అలాగే ఉంటుంది. బ్రేకప్‌ గురించి మాట్లాడేందుకు వారు సుముఖత చూపడం లేదు. దీని గురించి చర్చ జరగడం కూడా వారికి ఇష్టం లేదు అని తెలిపారు.

ఐదేళ్లుగా ప్రేమాయణం
కాగా మలైకా అరోరా, అర్జున్‌ కపూర్‌ 2019లో తాము డేటింగ్‌లో ఉన్న విషయాన్ని బయటపెట్టారు. పార్టీలు, ఫంక్షన్స్‌కు సైతం కలిసి వెళ్లేవారు. కలిసున్న ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉండేవారు. అయితే గతేడాది.. వీరి ప్రేమ బంధం ముగిసిందంటూ వార్తలు రాగా వాటిని మలైకా కొట్టిపారేసింది. 

తనకంటే చిన్నవాడితో లవ్‌
అలాగే తనకంటే 12 ఏళ్లు చిన్నవాడిని ప్రేమించిందని విమర్శలు రాగా దానికి కూడా గట్టి కౌంటరిచ్చింది. ప్రేమకు వయసుతో పనేంటని ప్రశ్నించింది. ఇంతలా ఒకరికొకరు తోడునీడుగా ఉన్న వీళ్లు విడిపోయారని మరోసారి వార్తలు వస్తుండటంతో అభిమానులు కంగారుపడుతున్నారు. మలైకా- అర్జున్‌ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారనుకుంటే ఇలా ట్విస్ట్‌ ఇచ్చారేంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి మూవీ రివ్యూ

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)