Breaking News

వెంకీ మామ ఇంట పెళ్లి సందడి.. రెండో కూతురి ఎంగేజ్‌మెంట్‌!

Published on Tue, 10/24/2023 - 16:35

దగ్గుబాటి ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వెంకటేశ్‌-నీరజల రెండో కూతురు హయవాహిని పెళ్లి పీటలెక్కనుంది. వెంకటేశ్‌ పెద్దమ్మాయి ఆశ్రితకు కొన్నేళ్ల క్రితమే పెళ్లయింది. ఇప్పుడు రెండో అమ్మాయి హయవాహిని పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. విజయవాడకు చెందిన ఓ డాక్టర్‌ కుటుంబంతో వెంకీ మామ వియ్యమనేందుకు రెడీ అయ్యాడట.

రేపే నిశ్చితార్థం?
బుధవారం(అక్టోబర్‌ 25న) విజయవాడలో వీరి నిశ్చితార్థం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుక కోసం దగ్గుబాటి కుటుంబం ఈపాటికే విజయవాడ బయల్దేరిందని సమాచారం. ఇకపోతే ఈ వేడుకకు ఇరు కుటుంబాలు సహా అత్యంత దగ్గరి బంధుమిత్రులే హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా వెంకీమామ సోషల్‌ మీడియాలో పెద్ద యాక్టివ్‌గా ఉండడు. అంతేకాదు, తన పిల్లల్ని కూడా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావాలనుకోలేదు. వారికి నచ్చిన రంగాన్ని ఎంచుకోమని పిల్లలకు స్వేచ్ఛనిచ్చాడు.

సినిమాల సంగతేంటంటే?
ఇదిలా ఉంటే వెంకటేశ్‌ నుంచి సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. గతేడాది ఎఫ్‌ 3, ఓరి దేవుడా సినిమాలతో ప్రేక్షకులను పలకరరించాడు. ఈ ఏడాది రానా నాయుడు అనే వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే హిందీ చిత్రం కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌ సినిమాలో ముఖ్య పాత్రలో నటించాడు. ప్రస్తుతం వెంకీ మామ హీరోగా సైంధవ్‌ సినిమా చేస్తున్నాడు.

చదవండి: ఓటీటీలో సైకో థ్రిల్లర్‌ మూవీ.. ఎప్పుడు స్ట్రీమింగ్‌ అంటే?

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)