అలా డిమాండ్‌ చేయడంలో అర్థం లేదు : బన్నీ వాసు

Published on Tue, 09/02/2025 - 10:56

‘‘లిటిల్‌ హార్ట్స్‌’ చిత్ర కథ బాగుంది. యూత్‌ కంటెంట్‌తో మంచి వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో ఎక్కడా అశ్లీలత ఉండదు.. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. మా చిత్రం చూసి, ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారు’’ అని నిర్మాత బన్నీ వాస్‌ తెలిపారు. మౌళి తనుజ్, శివానీ నాగరం జంటగా సాయి మార్తాండ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘లిటిల్‌ హార్ట్స్‌’. ఈటీవీ విన్‌ ఒరిజినల్‌ ప్రొడక్షన్‌పై ఆదిత్య హాసన్‌ నిర్మించారు. ఈ సినిమాని బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ నెల 5న విడుదల చేస్తున్నారు. 

ఈ సందర్భంగా బన్నీ వాస్‌ మాట్లాడుతూ–‘‘సినిమాలకు ప్రేక్షకులు రావాలని మనం డిమాండ్‌ చేయడంలో అర్థం లేదు. సినిమా బాగుంటే వాళ్లే వస్తారు.  మల్టీప్లెక్స్‌లో ఫుడ్‌ రేట్స్‌ ఎక్కువగా ఉన్నాయనేది నిజమే. అయితే మూవీ బాగుంటే ప్రేక్షకుడు ఆ ఖర్చు భరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. రోజుకి ఐదు షోలు వేయాలని ప్రభుత్వం ఆదేశించినా పాటించడం లేదు.. ఇక్కడ నిబంధనలు ఎన్నో ఉంటాయి. కానీ, పాటించడమే అసాధ్యం’’ అన్నారు. 

వంశీ నందిపాటి మాట్లాడుతూ–    ‘‘బన్నీ వాస్‌గారు తన బ్యానర్‌ నుంచి తీసుకొస్తున్న తొలి చిత్రం ‘లిటిల్‌ హార్ట్స్‌’. ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. దానికి తగినట్లే నిర్మాతలూ మారాల్సి ఉంది’’ అని తెలిపారు.  

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)