Breaking News

నా జీవితంలో అలాంటి వ్యక్తి ఆయనొక్కడే: బన్నీవాసు ఆసక్తికర కామెంట్స్

Published on Wed, 08/14/2024 - 12:44

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌పై టాలీవుడ్ నిర్మాత బన్నీవాసు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన బన్నీపై ప్రశంసలు కురిపించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా నిలిచే స్నేహితుడు ఆయన ఒక్కడేనన్నారు. ఈ రోజు బన్నీ వాసు ఇక్కడ ఉన్నారంటే కారణం అల్లు అర్జున్‌ అని ఎమోషనలయ్యారు. మా ఇద్దరి మధ్య గ్యాప్‌ వచ్చిందని వస్తోన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.

బన్నీ వాసు మాట్లాడుతూ..' నా లైఫ్‌లో ఒకడున్నాడు. నేను ఎక్కడ ఉన్నా నాకు అండగా వచ్చి నిలబడతాడు. మా మధ్య గ్యాప్ వచ్చిందని డైలాగ్స్‌ వినిపిస్తున్నాయి. కానీ నాకు కష్టం వచ్చిందంటే ఇద్దరే ముందుంటారు. ఒకటి మా అమ్మ.. రెండో వ్యక్తి నా స్నేహితుడు బన్నీ. ఆయ్‌ సినిమా ప్రచారం సరిగ్గా జరగడం లేదని.. బన్నీని పోస్ట్‌ పెట్టమని అడగాలని మా టీమ్‌ వాళ్లు కోరారు. కానీ నేను  అడగలేదు. నేను సమాచారం ఇవ్వకుండానే ఆయనే తన ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. ఒక స్నేహితుడికి ఎప్పుడు నిలబడాలి అని తెలిసిన వ్యక్తి ఎవరంటే ఆయనే.  20 ఏళ్ల క్రితం నేను ఒక మిస్టేక్ చేశా. గీతా ఆర్ట్స్‌ నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి. ఆరోజు నా కోసం వాళ్ల నాన్నను కూడా ఎదిరించారు. అప్పుడు ఆయన సపోర్ట్‌ చేయకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. నాకే కాదు.. తన లైఫ్‌లో ఎవరికి పడిపోతున్నా బన్నీ సపోర్ట్‌గా నిలుస్తాడు. అంత మంచి వ్యక్తి అల్లు అర్జున్ ఒక్కడే' అంటూ బన్నీ గొప్పతనాన్ని వివరించారు.

కాగా... జూనియర్ ఎన్టీఆర్ బామర్ది నార్నే నితిన్, నయన్‌ సారిక జంటగా నటించిన చిత్రం ‘ఆయ్‌’. ఈ సినిమాను గోదావరి నేపథ్యంలో ఫుల్ కామెడీ అండ్ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అంజి కె. మణిపుత్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్చి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది.

 

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)