Breaking News

లైఫ్‌ అంతా అల్లు అర్జున్‌కు కాపలా కాయడమే సరిపోయింది: బన్నీ వాసు

Published on Thu, 06/12/2025 - 19:12

బన్నీ వాసు (Bunny Vas)ది పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు. కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా అల్లు అర్జున్‌ పరిచయమవ్వడం, అతడితో స్నేహం కుదరడంతో గీతా ఆర్ట్స్‌లో పని చేశాడు. అనంతరం అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌ కలిసి స్థాపించిన గీతా ఆర్ట్స్‌ 2 సంస్థలో పార్ట్‌నర్‌ అయ్యాడు. నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో హిట్‌ సినిమాలందించాడు. ఈ మధ్య తన స్నేహితులతో కలిసి బీవీ వర్క్స్‌ పేరుతో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించాడు. ఈ బ్యానర్‌లో బన్నీ వాసు మిత్ర మండలి అనే సినిమా నిర్మిస్తున్నాడు.

నా తండ్రికన్నా నీతోనే ఎక్కువ..
గురువారం (జూన్‌ 12న) ఈ మూవీ టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ.. నా జీవితంలో మా తండ్రితో కన్నా ఎక్కువగా మీ (అల్లు అరవింద్‌)తోనే ఉన్నాను. మా ఇంట్లో కన్నా మీ ఇంట్లోనే ఎక్కువగా ఉన్నాను. అలాంటిది ఈ రోజు ఇక్కడివరకు ఎదిగిన మమ్మల్ని చూస్తుంటే మీకెంత గర్వంగా ఉందో, మిమ్మల్ని చూస్తుంటే మాకూ అంతే సంతోషంగా ఉంది. మా జీవితంలో అల్లు అరవిందే గాడ్‌ ఫాదర్‌. ఇంత సపోర్ట్‌ ఇచ్చి, ఈ జీవితాన్ని ప్రసాదించినందుకు థాంక్యూ సో మచ్‌ సర్‌.

బన్నీకి కాపలా కాయడమే..
మేమందరం మంచి సినిమాలు తీస్తున్నామంటే అది అరవింద్‌గారు మాకు నేర్పిన శిక్షణ, విద్య అని చెప్పుకొచ్చాడు. సరిగ్గా అప్పుడే యాంకర్‌ స్రవంతి.. లైఫ్‌లో ఏ అమ్మాయికైనా ప్రపోజ్‌ చేశారా? వాళ్లు పడిపోయారా? అని అడిగింది. అందుకు బన్నీ వాసు ఏ అమ్మాయి నాకు పడిపోలేదు, పైగా తిట్లు తిన్నాను అని రిప్లై ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా.. నేను 19 ఏళ్ల వయసులో అరవింద్‌గారి దగ్గరకు వచ్చాను. అప్పటినుంచి నన్ను బన్నీగారి దగ్గర వాచ్‌మెన్‌గా పెట్టారు. నా జీవితమంతా ఆయనకు కాపలా కాయడమే సరిపోయింది. నా లైఫ్‌లో లవ్‌ పార్ట్‌ ఏదైనా మిస్సయిందంటే దానికి అరవింద్‌, బన్నీనే కారణం అని నవ్వుతూ చెప్పాడు.

చదవండి: పచ్చబొట్టు వేయించుకున్న సురేఖావాణి.. బిల్డప్‌ దేనికంటూ ట్రోలింగ్‌

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)