ఆ పెయిన్‌ నాకు తెలుసు: అల్లు శిరీష్‌

Published on Fri, 08/02/2024 - 00:06

‘‘ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడాన్ని ఇష్టపడను. ఒక సినిమా తర్వాత మరో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాను. అందుకే నా సినిమాలు కాస్త ఆలస్యంగా థియేటర్స్‌లోకి వస్తున్నాయి. కొంత బ్యాడ్‌ ప్లానింగ్‌ కూడా కారణం అనిపిస్తోంది. సాధారణంగా చిన్న, పెద్ద... ఏ సినిమా అయినా సరే అనుకున్న సమయానికి దాదాపు పూర్తి కావడం లేదు. ఎంతో కొంత ఆలస్యం అవుతున్నాయి’’ అని అల్లు శిరీష్‌ అన్నారు. అల్లు శిరీష్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బడ్డీ’.  కేఈ జ్ఞానవేల్‌ రాజా, అధనా జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో అల్లు శిరీష్‌ చెప్పిన సంగతులు.

⇒ ‘బడ్డీ’ కథను దర్శకుడు శామ్‌ చెప్పినప్పుడు టెడ్డీ బేర్‌ పాయింట్‌తో ఆల్రెడీ తమిళంలో ‘టెడ్డీ’, ఇంగ్లిష్‌లో మరో మూవీ ఉందని చెప్పాను. ‘బడ్డీ’ కథ విన్నాక ఓటీటీలో ‘టెడ్డీ’ చూడండి... కచ్చితంగా ‘బడ్డీ’ కొత్తగా అనిపిస్తుందని శామ్‌ అన్నారు. దీంతో ‘బడ్డీ’ కథ విన్నాను. టెడ్డీ బేర్‌లోకి ప్రాణం రావడం అనే పాయింట్‌ తప్ప మిగతా అంతా కొత్తగా అనిపించింది. హీరో, విలన్‌కు మధ్య ఉండే ఘర్షణ, హీరో క్యారెక్టరైజేషన్, లవ్‌ స్టోరీ... అంతా కొత్తగా డిజైన్‌ చేసినట్లనిపించింది. అందుకే ‘బడ్డీ’ ఒప్పుకున్నాను. 

⇒ ‘బడ్డీ’ పోస్టర్‌ బయటకు రాగానే ఇది తమిళ మూవీ ‘టెడ్డీ’కి రీమేక్‌ కదా అనే కామెంట్స్‌ వినిపించాయి. ‘కాదు... మేం కష్టపడి స్ట్రయిట్‌గా చేసిన తెలుగు సినిమా’ అని చెప్పడమే మాకు సవాల్‌గా అనిపిస్తోంది. మేం ఎంత చెప్పినా రీమేక్‌ అని కామెంట్స్‌ చేసేవారు చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిని మార్చలేం. 

⇒ ‘బడ్డీ’ని గతేడాది డిసెంబరులోనే రిలీజ్‌ చేయాలనుకున్నాం. కానీ టెడ్డీ బేర్‌ ఎమోషన్స్, లుక్స్‌తో పాటు సినిమాలో మూడువేలకు పైగా గ్రాఫిక్స్‌ షాట్స్‌ ఉన్నాయి. వీటిని కరెక్ట్‌గా చేయించాలంటే చేసే ఆర్టిస్టులకు సమయం ఇవ్వాలి. అందుకే రిలీజ్‌ ఆలస్యమైంది. ∙కథగా చెప్పాలంటే ‘బడ్డీ’ లవ్‌స్టోరీ. హీరో పైలట్‌. హీరోయిన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌. హీరోయిన్‌కు హీరో తెలుసు. కానీ హీరోకు హీరోయిన్‌ తెలియదు. ఫైనల్‌గా వీరి లవ్‌స్టోరీ ఏమైంది? మధ్యలో ‘బడ్డీ’ క్యారెక్టర్‌ ఏంటి? అన్నది కథ. 

⇒ జ్ఞానవేల్‌ రాజాగారు సినిమాను రిచ్‌గా నిర్మించారు. నాకుప్రోడక్షన్‌లో కాస్త అనుభవం ఉంది. కానీ నేను హీరోగా చేసే  సినిమాలప్రోడక్షన్‌ విషయాల్లో జోక్యం చేసుకోవాలనుకోను. ఓ ప్రముఖ నిర్మాత (అల్లు అరవింద్‌) తనయుడిగా,ప్రోడక్షన్‌ గురించి అవగాహన ఉన్న వ్యక్తిగా వేస్ట్‌ప్రోడక్షన్‌ వల్ల కలిగే పెయిన్‌ నాకు తెలుసు. అందుకే వృథా ఖర్చుని ్రపోత్సహించను.

Videos

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)