Breaking News

భారీగా 'భ్రమయుగం' కలెక్షన్స్‌.. బిగ్‌ మార్క్‌ను దాటేసిన మమ్ముట్టి

Published on Sun, 02/25/2024 - 14:29

మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి నటించిన 'భ్రమయుగం' సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. కళ్లు చెదిరే కలెక్షన్స్‌తో రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. మొదట మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 23న తెలుగులో రిలీజ్‌ అయింది. టాలీవుడ్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ మూవీని విడుదల చేసింది. రాహుల్‌ సదాశివన్‌ తెరకెక్కించిన ఈ సినిమాని చక్రవర్తి రామచంద్ర, ఎస్‌.శశికాంత్‌ సంయుక్తంగా నిర్మించారు. అర్జున్‌ అశోకన్‌, సిద్ధార్థ్‌ భరతన్‌, అమల్దా లిజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కేవలం మూడు పాత్రలతో అది కూడా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు.

తాజాగా ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్‌ మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అన్ని భాషలతో కలుపుకుని రూ. 50 కోట్ల కలెక్షన్స్‌ వచ్చినట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ వారు ప్రకటించారు. సినిమా పట్ల మంచి టాక్‌ రావడంతో రూ. 100 కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరుస హిట్లతో సౌత్‌ ఇండియా బాక్సాఫీస్‌ వద్ద మమ్ముట్టి  సత్తా చాటుతున్నాడు.

భ్రమయుగం ఓటీటీ రైట్స్‌ కూడా సుమారు రూ. 25 కోట్లకు పైగా సోనీ లివ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల హ‌క్కులు మొత్తం సోనీ లివ్ ద‌క్కించుకున్న‌ట్లు తెలిసింది. కేవలం రూ. 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతుంది. మార్చి చివరి వారంలో సోనీ లివ్‌లో భ్రమయుగం స్ట్రీమింగ్‌ కానున్నట్లు సమాచారం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)