Breaking News

సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ మలయాళ మూవీస్.. వీటిలో అంతలా ఏముంది?

Published on Sun, 02/18/2024 - 16:54

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. ఉన్నంతలో 'ఊరి పేరు భైరవకోన' మాత్రమే ఎంటర్‌టైన్ చేస్తోంది. మరోవైపు ఈ వారమే రిలీజైన మలయాళ చిత్రాలు 'భ్రమయుగం', 'ప్రేమలు' హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే వీటి గురించి తెలుగు ప్రేక్షకుల డిస్కస్ చేస్తుండటమే ఇప్పుడు ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఈ రెండు మూవీస్‌లో అంతలా ఏముంది? కలెక్షన్స్ ఎంతనేది ఇప్పుడు చూద్దాం.

ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో సినిమా అంటే ఫుల్ కలర్‌ఫుల్‪‌గా ఉండాల్సిందే. కానీ మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మాత్రం బ్లాక్ అండ్ వైట్ పద్ధతిలో తీసిన 'భ్రమయుగం'లో నటించాడు. నలుపు తెలుపు కలర్‌కి తోడు కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రానికి ఆడియెన్స్ మెల్లమెల్లగా కనెక్ట్ అవుతున్నారు. స్టోరీ పరంగా అక్కడక్కడ ల్యాగ్ ఉన్నప్పటికీ.. యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా అన్ని టాప్ నాచ్ ఉన్నాయి. హైదరాబాద్‌లోనూ దీనికి డిమాండ్ గట్టిగానే ఉందండోయ్. రెండు రోజుల్లోనే దీనికి రూ.10 కోట్ల వరకు వసూళ్లు దక్కాయి.

(ఇదీ చదవండి: అందుకే ఇంత లావయ్యాను.. చిన్నప్పుడు ఆ భయం ఉండేది: వైవా హర్ష)

'ప్రేమలు' అనే మలయాళ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ కూడా వారం క్రితం థియేటర్లలోకి వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. బ్యాక్ డ్రాప్‌ అంతా దాదాపు హైదరాబాద్‌లోనే ఉండటంతో మనోళ్లు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. కలెక్షన్స్ కూడా రూ.35 కోట్లకు పైనే ఉన్నట్లు తెలుస్తోంది. రూ.5 కోట్లు పెట్టి తీస్తే ఈ రేంజు వసూళ్లు వచ్చేసరికి మన నిర్మాతలు కూడా దీన్ని రీమేక్ లేదంటే డబ్బింగ్ చేసేయాలని చూస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాలు కూడా వేటికవే విభిన్నంగా ఉండటంతో పాటు కాస్త డిఫరెంట్ ఫీల్ ఇస్తున్నాయి. హారర్ థ్రిల్లర్ కథతో తీసిన 'భ్రమయుగం' కొందరికి కనెక్ట్ కాగా.. యూత్‌కి నచ్చే విషయంలో 'ప్రేమలు' ఫుల్ మార్క్స్ కొట్టేస్తోంది. టాలీవుడ్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం త్వరలో వీటిని తెలుగులో కూడా డబ్ చేసి వదలబోతున్నారట.

(ఇదీ చదవండి: మెగా హీరో మూవీకి చిక్కులు.. షూటింగ్‌కి ముందే నోటీసులు)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)