Breaking News

మూడేళ్ల తర్వాతే బ్రహ్మాస్త్రం పార్ట్‌ 2 

Published on Wed, 04/05/2023 - 01:27

‘బ్రహ్మాస్త్రం’ చిత్రంలోని తర్వాతి భాగాలను చూడాలనుకుంటున్న ప్రేక్షకులు మరింత సమయం వేచి ఉండక తప్పదు. దర్శకుడు అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న హిందీ ట్రయాలజీ ‘బ్రహ్మాస్త్ర’. మూడు భాగాల ‘బ్రహ్మాస్త్రం’లోని తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర: పా ర్ట్‌ వన్‌ శివ’ గత ఏడాది సెప్టెంబరు 9న విడుదలై, ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ హీరో హీరోయిన్లుగా అమితాబ్‌ బచ్చన్, నాగార్జున కీలక పా త్రల్లో ఈ చిత్రం రూ΄పొందింది.

అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్‌ జోహార్‌ నిర్మించారు. కాగా ‘బ్రహ్మాస్త్ర’ ట్రయాలజీలోని రెండో భాగం ‘బ్రహ్మాస్త్ర: పా ర్టు 2 దేవ్‌’, ‘బ్రహ్మాస్త్ర’ థర్డ్‌ పా ర్టులను వరుసగా 2026 డిసెంబరు, 2027 డిసెంబరులో విడుదల చేయనున్నట్లు దర్శకుడు అయాన్‌ ముఖర్జీ మంగళవారం అధికారికంగా ప్రకటించారు.

‘‘బ్రహ్మాస్త్ర: పా ర్ట్‌ 1 శివ’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో సెకండ్‌ పా ర్ట్, థర్డ్‌ పా ర్ట్‌ స్క్రిప్ట్స్‌పై మరింత ఫోకస్‌ పెట్టాను. అలాగే ఈ రెండు సినిమాలను ఏడాది గ్యాప్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు దర్శకుడు అయాన్‌ ముఖర్జీ. అలాగే తాను మరో సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్‌ ఉందని, సరైన టైమ్‌లో ఆ విషయాన్ని వెల్లడిస్తానని కూడా అయాన్‌ పేర్కొన్నారు. దాంతో ఇది ‘వార్‌ 2’ సినిమా గురించే అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)