Breaking News

నవ్వులతో కాసులు కురిపించే బ్రహ్మానందం రెమ్యునరేషన్‌ తెలుసా..?

Published on Sun, 05/04/2025 - 08:22

నవ్వు నాలుగు విధాల మంచిదని కొందరంటే.. నవ్వు నాలుగు విధాల చేటు.. అని మరికొందరంటారు. అయితే ఇప్పుడు బతుకు పోరాటం వల్ల పదిమందిలో కూర్చోని కబుర్లు చెప్పుకుంటూ నవ్వే వారు లేరు. అందుకే నాలుగు గోడల మధ్య సినిమా థియేటర్‌కు వెళ్లి నవ్వుకోవాల్సిన పరిస్థితి ఉంది. నేడు ‘ప్రపంచ నవ్వుల దినోత్సవం’ సందర్బంగా మనల్ని బాగా నవ్వించే నటుడు బ్రహ్మానందం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. దేశంలోనే బెస్ట్‌ కమెడియన్స్‌ లిస్ట్‌లో మన బ్రహ్మీ టాప్‌లో ఉంటారు. ఆపై అందరికంటే ఎక్కువ సినిమాలు చేసిన రికార్డ్‌ కూడా ఆయన పేరుతోనే ఉంది. ఒక్కో సినిమాకు  బ్రహ్మానందం రెమ్యునరేషన్ ఎంత..? ఆయన ఆస్తుల వివరాలు ఎంత ఉండవచ్చు అనే విషయాలు తెలుసుకుందాం.

బ్రహ్మానందం ఒక్కో సినిమాకు రూ. 2 కోట్లకు పైగా రెమ్యునరేషన్‌ తీసుకుంటారు. సినిమాలో తన పాత్రను బట్టి రోజుకు రూ. 10 లక్షల వరకు తీసుకుంటారని సమాచారం. అంతేకాకుండా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు , టెలివిజన్ ప్రకటనల ద్వారా కూడా ఆయన గణనీయమైన ఆదాయం సంపాదిస్తారు. ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు సుమారు రూ1.5 కోట్లు సంపాదిస్తారని తెలుస్తోంది. సుమారు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించిన బ్రహ్మానందం ఆస్తి రూ. 500 కోట్లకు పైగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా బ్రహ్మానందం పంచే కామెడీకి ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. తెరపై ఆయన కనిపిస్తే చాలు ఆడియెన్స్‌ విజిల్స్‌ వేస్తారు. అలా హాస్య ప్రపంచానికి రాజు మన బ్రహ్మీనే అని చెప్పవచ్చు. కేవలం ఆయన పండించిన నవ్వుల వల్లనే కొన్ని సినిమాలు హిట్‌ అయ్యాయి.

రెమ్యునరేషన్‌ విషయంలో ఇలాగే ఉంటా: బ్రహ్మానందం
రెమ్యునరేషన్‌ విషయంలో బ్రహ్మానందంపై  చాలా రూమర్లు వచ్చాయి. పారితోషికం విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని చాలా మంది ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. ఇదే అంశంపై ఆయన గతంలో ఇలా చెప్పారు. 'చిత్రపరిశ్రమలో చాలా మంది నుంచి ఏం నేర్చుకోవాలో నేను ఇప్పటికీ తెలుసుకోలేదు. కానీ, ఏం నేర్చుకోకూడదో అనేది మాత్రం పూర్తిగా తెలుసుకున్నాను. మన చుట్టూ డబ్బుని పెద్దగా పట్టించుకోని వాళ్లు చాలా మంది ఉన్నారు. నా వరకు అయితే.. డబ్బు విషయంలో గట్టిగానే ఉంటాను. అలా లేకపోతే మన కష్టానికి  వంద రూపాయలు ఇచ్చేవాడు.. పది రూపాయలు ఇచ్చి సరిపెడుతాడు. అలాంటి సమయంలో మన జీవితం ఎలా ఉంటుంది..? అందుకే నేను డబ్బుకు గౌరవం ఇవ్వడం అలవాటు చేసుకున్నాను. అలా జీవించాను కాబట్టే మా కుటుంబంలోని 23 మంది ఆడపిల్లలకు వివాహాలు చేశాను. వారందరికీ పెళ్లిల్లు చేయకపోతే జీవితాలు ఏమయ్యేవి..? బాధ్యత తీసుకున్నప్పుడే డబ్బు విలువ తెలుస్తోంది. ఇలా బహిరంగంగా అలాంటి విషయాలు చెప్పుకోవాల్సిన పనిలేదు.' అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)