మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
Breaking News
మార్కండేయుడిగా బహ్మాజీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
Published on Fri, 09/04/2026 - 16:45
బ్రహ్మాజీ మార్కండేయుడి పాత్రలో తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ‘కృష్ణంభజే’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు కలాల్ శ్రీనివాస్ నిర్మిస్తుండగా.. నాగరాజ్ కొట్టే దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణాష్టమి కానుకగా బ్రహ్మాజీ 'కృష్ణంభజే' ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో లాంఛ్ చేశారు.
పోస్టర్లో బ్రహ్మాజీ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. బ్రహ్మాజీ మార్కండేయుడి గెటప్‌లో సంప్రదాయ ఆధ్యాత్మిక రూపంలో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. కాషాయ వస్త్రధారణ, రుద్రాక్ష మాలలు, నుదుటిపై విభూతి, చేతిలో ఆయుధంతో ఆయన లుక్ ప్రత్యేకంగా నిలుస్తోంది. భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతిబింబంగా కనిపిస్తున్న ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. పౌరాణిక, భక్తిరస అంశాలను మేళవిస్తూ తెరకెక్కిస్తున్నారు. కథకు అనుగుణంగా ప్రత్యేకమైన పాత్రలు, ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
కాగా.. ఈ చిత్రంలో ప్రదీష్, వంగమయి పటేల్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు, టీజర్, ఇతర ప్రచార చిత్రాలను త్వరలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ మూవీలో మురళీ గౌడ్, రచ్చ రవి, అభయ్ బెతిగంటి, గౌతమ్ రాజు, దయానంద్ రెడ్డి, యాదమ్మ రాజు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రచ్చ రవి డైలాగ్స్ అందిస్తున్నారు.
Tags : 1