Breaking News

తండ్రిగా చాలా సంతోషంగా అనిపించింది: బ్రహ్మానందం

Published on Sun, 02/16/2025 - 01:30

‘‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandam) సినిమా చూసిన వారు ‘మీ కన్నా.. మీ అబ్బాయి బాగా చేశాడు’ అని రాజా గౌతమ్‌ని మెచ్చుకుంటుంటే ఓ తండ్రిగా చాలా సంతోషంగా అనిపించింది. ప్రేక్షకులకు కొత్తగా కనిపించాలనే ఆలోచనతోనే నేను సినిమాలు చేస్తుంటాను. చాలా కాలం తర్వాత ‘బ్రహ్మా ఆనందం’ వంటి ఓ మంచి సినిమా, మంచి పాత్ర చేశాననే సంతృప్తి కలిగింది’’ అని నటుడు బ్రహ్మానందం చెప్పారు. ఆర్‌వీఎస్‌ నిఖిల్‌ దర్శకత్వంలో బ్రహ్మానందం(Brahma Anandam), ఆయన తనయుడు రాజా గౌతమ్‌(Raja Gautam) తాతా మనవళ్లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’.

ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌ హీరోయిన్లుగా నటించారు. సావిత్రి, ఉమేష్‌ కుమార్‌ సమర్పణలో రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. శనివారం నిర్వహించిన సక్సెస్‌ మీట్‌(Success Meet)లో రాజా గౌతమ్‌ మాట్లాడుతూ–‘‘బ్రహ్మా ఆనందం’ చూసిన వారు నా నటన గురించి మాట్లాడుతుండటం హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు.

‘‘నా గత చిత్రాల్లా ‘బ్రహ్మా ఆనందం’కి కూడా మంచి మౌత్‌ టాక్‌ వచ్చింది. అన్ని చోట్లా షోలు ఫుల్‌ అవుతున్నాయి’’ అని రాహుల్‌ యాదవ్‌ చెప్పారు. ‘‘ప్రేక్షకులతో కలిసి సినిమా చూశాం... మేం ఊహించని సన్నివేశాల్లోనూ నవ్వుతున్నారు’’ అని ఆర్‌వీఎస్‌ నిఖిల్‌ తెలిపారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)