Breaking News

పవన్‌ వ్యాఖ్యలు.. ట్రెండింగ్‌లో #BoycottHHVM

Published on Tue, 07/22/2025 - 19:38

పవన్‌ కల్యాణ్‌ ప్రవర్తన వింతగా ఉంటుంది. సినిమాలు వేరు రాజకీయాలు వేరని ఆయనే చెబుతాడు. మళ్లీ ఆయనే సినిమా వేదికపై రాజకీయాలు, రాజకీయ వేదికలపై సినిమా విషయాలు మాట్లాడుతాడు. పవన్‌ ప్రవర్తనే ఇప్పుడు ఆయన సినిమాను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. ఆయన హీరోగా నటించిన హరి హర వీరమల్లు సినిమాకు ఇప్పుడు నిరసన సెగ తగిలింది. పవన్‌ వ్యాఖ్యలతో విసుగెత్తిపోయిన వైఎస్సార్‌సీసీ అభిమానులకు తోడు అల్లు అర్జున్‌, మహేశ్‌, ప్రభాస్‌ లాంటి స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ కూడా హరిహర వీరమల్లు సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ ట్వీట్స్‌ చేస్తున్నారు. దీంతో #BoycottHHVM ట్యాగ్‌ ఇప్పుడు ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది.

ఏం జరిగిదంటే..
తాజాగా జరిగిన హరిహర వీరమల్లు సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ రాజకీయాలు మాట్లాడారు. సినిమా గురించి చెప్పడం మరచి.. ‘గతంలో భీమ్లా నాయక్‌ సినిమా టికెట్‌ రూ.10-15 పెట్టిన నేను అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం. మన సత్తా ఏంటో చూపిద్దాం’ అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. దీనికి ఆజ్యం పోసేలా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. ఇప్పుడు ఇదే నిరసనకు దారి తీసింది. వైఎస్సార్‌సీపీ అభిమానులు పవన్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సినిమాను బాయ్‌కాట్‌ చేస్తున్నారు. మేమే కాదు ..మాతో పాటు మరో 20-30 మందిని కూడా సినిమాను చూడనియ్యబోమంటూ #BoycottHHVM హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్స్‌ చేస్తున్నారు.

స్టార్‌‌ హీరోల ఫ్యాన్స్‌ కూడా..
అభిమానం ఉంటే ఆ హీరో సినిమాలు చూడాలే తప్ప ఇతర హీరోల సినిమాలను నాశనం చేయకూడదు. కానీ పవన్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఏ హీరోకైనా కాస్త పేరొస్తే చాలు.. ఆయన సినిమాను తొక్కేయాలని చూస్తారనే టాక్‌ టాలీవుడ్‌లో ఉంది. గతంలో బన్నీ, మహేశ్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌ సినిమాలపై ట్రోల్స్‌ చేశారు. పుష్ప 2 రిలీజ్‌ అప్పుడు అయితే అల్లు అర్జున్‌పై దారుణమైన కామెంట్స్‌ చేస్తూ.. సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. 

మెగా ఫ్యాన్స్ వర్సెస్ ఇతర హీరోల ఫ్యాన్స్‌ అన్నట్లు అందరి హీరోల సినిమాలను ట్రోల్‌ చేశారు. ఇప్పుడు ఆ స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ కూడా పవన్‌ సినిమాపై పగ బట్టారు. తాము హరిహర వీరమల్లు సినిమాను చూడబోం అంటూ ట్వీట్స్‌ చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున ట్రోల్‌ చేస్తూ..తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. ఒకవైపు వైఎస్సార్‌సీపీ అభిమానులు, మరోవైపు స్టార్‌ హీరోల ప్యాన్స్‌ దెబ్బకి #BoycottHHVM హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Videos

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)