Breaking News

శ్రీదేవి నాతో ఉన్నట్లే ఉంది.. అప్పుడెంతో ప్రయత్నించా, కానీ..: బోనీ కపూర్‌

Published on Mon, 12/23/2024 - 17:33

ఇప్పటికీ నా భార్య నాతోనే ఉన్నట్లుంది అంటున్నాడు నిర్మాత బోనీ కపూర్‌. బరువు తగ్గడమే పనిగా పెట్టుకున్న ఆయన దాదాపు 14 కిలోలు తగ్గిపోయాడట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మొదట్లో నాకు తెలియకుండానే కొంత బరువు తగ్గాను. దాదాపు 13-14 కిలోల మేర తగ్గానని తెలుసుకున్నప్పుడు మరింత బరువు తగ్గాలనిపించింది. పైగా కాస్త సన్నబడ్డాక నా శరీరాకృతి కూడా మారింది. అలా అధిక బరువు ఉన్న నేను 95 కిలోలకు వచ్చాను. 

నాకు నేనే నచ్చలేదు
నా ఎత్తూపొడుగుకు 87-88 ఉండాలట! అంటే ఇంకా కనీసం ఎనిమిది కిలోలైనా తగ్గాల్సి ఉంది. తు ఝూటి మే మక్కర్‌ సినిమా సమయంలో అయితే బొద్దుగా ఎప్పటిలాగే ఉన్నాను. ఎప్పుడైతే నన్ను నేను స్క్రీన్‌పై చూసుకున్నానో నాకు నేనే నచ్చలేదు. అందుకే ఆ సినిమా తర్వాత నేను సన్నబడాలని ప్రయత్నాలు మొదలుపెట్టాను. నా భార్య శ్రీదేవి ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపించేది. తనతో కలిసి వాకింగ్‌కు వెళ్లేవాడిని, జిమ్‌కు వెళ్లేవాడిని.

నా వల్ల కాలేదు
ఎప్పుడు, ఏం తినాలనే విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించేది. నేనూ ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు. కానీ గత రెండేళ్లుగా నన్ను నేను చూసుకున్నప్పుడు మార్పు అవసరం అనిపించింది. ఈ ప్రయాణంలో శ్రీదేవి నావెంటే ఉన్నట్లుగా ఉంది. బరువు తగ్గడానికి తను నన్ను ప్రేరేపిస్తున్నట్లనిపిస్తోంది. ఇప్పుడు నా లుక్‌ చూసి పై లోకంలో ఉన్న నా భార్య కచ్చితంగా గర్వపడుతుంది అంటున్నాడు. కాగా శ్రీదేవి- బోనీకపూర్‌ 1997లో పెళ్లి చేసుకున్నారు. వీరికి జాన్వీ, ఖుషి కపూర్‌ సంతానం. 2018లో శ్రీదేవి మరణించింది.

చదవండి: ఓటీటీలోకి సూపర్ హిట్ సిరీస్ రెండో సీజన్

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)