Breaking News

అలా ప్రవర్తించినందుకు పిల్లలు తిట్టారు, ఏడ్చారు.. నాకూ దుఃఖమాగలేదు!

Published on Fri, 05/17/2024 - 18:24

ఎవరైనా దేని గురించైనా ఆరా తీస్తే చాలు.. కొందరు ఏదీ దాచుకోకుండా ఉన్నదంతా కక్కేస్తారు. దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్‌ కూడా అంతే! మీడియా అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా బదులిస్తుంటాడు. ఇంటి విషయాలను కూడా పూసగుచ్చినట్లు చెప్తుంటాడు. ఈ వైఖరి వల్ల పిల్లలు ఇబ్బందిపడుతున్నారట! ఈ విషయాన్ని బోనీ కపూరే వెల్లడించాడు.

నా కుటుంబం గురించి అడగొద్దు
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బోనీ కపూర్‌కు.. పబ్లిక్‌గా కుటుంబం గురించి పొరపాటున ఎప్పుడైనా తప్పుగా మాట్లాడారా? దీనివల్ల ఇంట్లో ఏమైనా సమస్యలు వచ్చాయా? అన్న ప్రశ్న ఎదురైంది. అందుకతడు 'ఇది చాలాసార్లు జరిగింది. అందుకే ఇంటర్వ్యూకి కూర్చునే ముందు అక్కడున్నవారికి కేవలం నా గురించి మాత్రమే అడగండి, నా కుటుంబం గురించి అడగొద్దు అని మరీ మరీ చెప్తాను. ఎందుకంటే కొన్నిసార్లు ఏదీ దాచుకోకుండా అన్నీ చెప్పేస్తుంటాను. 

వాళ్లకు నచ్చదు
అది నా పిల్లలకు అస్సలు నచ్చదు. ఎందుకలా ప్రతీది చెప్తావని కోప్పడతారు. ముఖ్యంగా యాక్టింగ్‌కు సంబంధించిన విషయాలను జనాలే తెలుసుకోవాలి తప్ప తమంతట తాముగా చెప్పకూడదంటారు. నేనేమో అవన్నీ ముందే లీక్‌ చేస్తుంటాను. వారు హర్ట్‌ అయ్యారని అర్థమవగానే తప్పయిపోయిందంటూ సారీ చెప్పేస్తాను' అని బదులిచ్చాడు.

అందరం ఏడ్చేశాం
ఈ మధ్య అలాంటిదేమైనా జరిగిందా? అన్న ప్రశ్నకు.. 'ఇప్పట్లో ఏమీ జరగలేదు కానీ గతంలో నేను మీడియా ముందు ఉన్నదంతా మాట్లాడటం వల్ల వాళ్లు చాలా అప్‌సెట్‌ అయ్యారు. నన్ను తిట్టారు. నేను బాధపడేసరికి ఏడ్చేశారు. నేనూ ఏడ్చేశాను. సారీ చెప్తుంటే అలా మాట్లాడొద్దని వాళ్లే బుజ్జగించారు' అని బోనీకపూర్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: రోడ్డునపడ్డా.. అడుక్కుతింటున్నా అని ప్రచారం చేశారు.. బాధేసింది!

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)