Breaking News

జాన్వీ కపూర్‌కు కండీషన్‌ పెట్టిన తండ్రి.. ఆ స్టార్‌ హీరోతో నటించొద్దట!

Published on Mon, 09/11/2023 - 10:02

నటిగా తన పరిధిని పెంచుకునే ప్రయత్నంలో ఉంది బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌. అలనాటి నటి శ్రీదేవి కూతురు అయిన ఈమె ధడక్‌ అనే హిందీ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్‌ ఆ తర్వాత వరుసగా అవకాశాలను రాబట్టుకుంటోంది. అయితే తన తల్లి శ్రీదేవి 1980 – 90 ప్రాంతంలో దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్‌గా రాణించారు.

సౌత్‌లో రాణించాలని జాన్వీ ప్లాన్‌
దీంతో జాన్వీ కపూర్‌ కూడా దక్షిణాది చిత్రాల్లో నటించాలని చాలాకాలం నుంచి బలంగా కోరుకుంటోందట. అదేవిధంగా దక్షిణాది దర్శక నిర్మాతలు కూడా ఆమెను తమ చిత్రాల్లో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన దేవర చిత్రంలో నటిస్తోంది జాన్వీ. అలాగే ఈ బ్యూటీ తమిళ చిత్రాల్లోనూ నటించేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. అందులో భాగంగా తమిళ చిత్రాలు ఎక్కువగా చూస్తున్నారట.

ఆ ఇద్దరు హీరోలతో ఓకే, కానీ..
ఈ క్రమంలో ఆమె తండ్రి ఒక కండీషన్‌ పెట్టాడంటూ ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. హీరో ధనుష్‌కు జంటగా నటించరాదన్నదే ఆ కండిషన్‌ అంట. హీరో విజయ్‌ లేదా అజిత్‌ సినిమాల ద్వారా తన కూతురిని కోలీవుడ్‌లో పరిచయం చేయాలని బోనీకపూర్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో నిజం ఎంతుందో కానీ, కోలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు ఎదిగిన ధనుష్‌ సరసన నటించరాదని తన కూతురికి బోనీకపూర్‌ ఎందుకు కండీషన్‌ పెడుతున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

చదవండి: మెగా ఫ్యాన్స్‌ ఎఫెక్ట్‌.. కీలక నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)