Breaking News

Bomb Movie Review: రెండు ఊళ్ళను కలిపిన మరణం

Published on Sun, 10/19/2025 - 16:49

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘బాంబ్‌’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. 

ఆలోచన... ఓ అణువంత ఆలోచన కూడా పరమాణువంత ఫలితాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇక ఇదే ఆలోచనకు సృజనాత్మకత తోడైతే వెండితెరకు ప్రేక్షకులు పూర్తిగా కట్టుబడిపోతారు. అదే పంథాలో విడుదలైన సినిమా ‘బాంబ్‌’(Bomb Movie Review). ఈ టైటిల్‌ చూసి ఇదేదో ఫక్తు క్రైమ్‌ థ్రిల్లర్‌ అనుకునేరు! అస్సలు కానే కాదు. ఈ సినిమా ప్రేక్షకుడి అంచనాలకు ఏమాత్రం అందదు. అందుకే ఈ సినిమా ఆలోచన ఓ అద్భుతం. మణికందన్, అభిషేక్‌తోపాటు విశాల్‌ వెంకట్‌ అందించిన ఈ కథను విశాల్‌ వెంకట్‌ దర్శకత్వం వహించి దృశ్య కావ్యంగా మలిచిన విధానం అభినందనీయం. అంతలా ఈ ‘బాంబు’లో ఏముందో ఓసారి చూద్దాం. 

కాలకమ్మాయిపట్టి అనే ఊరు పెద్ద గాలివాన సమయంలో ఓ బండ పగలడం వల్ల కాలపట్టి, కమ్మాయిపట్టి అని రెండు గ్రామాలుగా విడిపోతుంది. బండ పగిలి ఒకటి చిన్న ముక్కగా, మరొకటి పెద్ద ముక్కగా... రెండు వేరు వేరు ప్రాంతాలలో పడడం వల్ల ఆ ఊరులోని జనాల మధ్య భేదాభ్రిపాయాలు రగిలి రెండు ఊళ్ళుగా విడిపోతారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ ఊరు ముక్కలవడంతో ఊరిలో పాటించే కట్టుబాట్లతో పాటు జరగబోయే పండగ పబ్బాలు కూడా కళ తప్పుతాయి. 

ఊరు కలిసున్నప్పటి నుండి ఉంటున్న కదిరవన్‌ అనే వ్యక్తి రెండుగా విడిపోయిన ఊరుని చూసి బాధతో ఉన్నట్టుండి చనిపోతాడు. కదిరవన్‌నే అంటిపెట్టుకుని ఉండే స్నేహితుడైన మణిముత్తు మాత్రం తను చనిపోలేదనే వాదిస్తుంటాడు. దానికి తోడు చనిపోయిన కదిరవన్‌ శరీరం నుండి అపానవాయువు వింత వింత శబ్దాలతో ఇంకా వస్తూనే ఉంటుంది. 

ఇంతలో కదిరవన్‌ శరీరాన్ని ఊరు మధ్యలో ఉన్న ఓ కుర్చీలో శవంగా కూర్చోపెడతారు. చనిపోయిన కదిరవన్‌ శరీరం విడిపోయిన రెండు గ్రామాలను ఎలా కలుపుతుందనేది మాత్రం ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్‌ అవుతున్న ‘బాంబ్‌’ సినిమాలోనే చూడాలి. రాబోయే దీపావళికి చెవులు దద్దరిల్లే శబ్దాలతో ఎన్నో బాంబులు మన చెవులను అదరగొడతాయి. కానీ ఈ సినిమా బాంబు మాత్రం మీ అంచనాలకు అందకుండా ఆహ్లాదపరుస్తుంది. కాబట్టి మీ దీపావళి బాంబులతో పాటు ఈ ‘బాంబు’ను కూడా ఓసారి చూసేయండి. వర్త్‌ టు వాచ్‌ ఫర్‌ దిస్‌ దివాలి. 
    – హరికృష్ణ ఇంటూరు  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)