Breaking News

బాలీవుడ్‌లోనే అతి ఖరీదైన బంగ్లా అదే.. అమితాబ్, షారూఖ్‌ది కాదు..

Published on Wed, 06/25/2025 - 12:31

ముంబయిలో అత్యంత ఖరీదైన భవనాలు చాలానే ఉన్నాయి. సహజంగానే వాటిలో ఎక్కువ బాలీవుడ్‌ ప్రముఖులవే. మరీ ముఖ్యంగా షారూఖ్‌ ఖాన్‌ మన్నత్‌ నివాసం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్లు ఒకరిని మించి ఒకరు ఖరీదైన భవనాల యజమానులుగా కావడానికి ఉవ్విళ్లూరుతుంటారు.. అయితే షారూఖ్, అమితాబ్‌ తదితర బిగ్‌స్టార్లు అందరినీ తోసి రాజని ఓ యువ జంట కొనుగోలు చేసిన ఓ ఇల్లు వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటిదాకా బాలీవుడ్‌ ప్రముఖుల అన్ని భవనాల కన్నా ఇదే ఖరీదైనదిగా తెలుస్తోంది.

ముంబై రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది ఆ యువ జంట కొన్న  భవనం. ముంబైలో వీరు కొనుగోలు చేసిన భవనం ఇప్పుడు బాలీవుడ్‌ సర్కిల్‌లో మాత్రమే కాదు ముంబయి నగరంలోననూ హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ లగ్జరీ బంగ్లా ధర మన్నత్‌ (షారూక్‌ ఖాన్‌ స్వంతమైన ఫేమస్‌ బంగ్లా) కంటే ఎక్కువ కావచ్చన్న ఊహాగానాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ భవనానికి వీరు వెచ్చించిన మొత్తం  ముంబై రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో కొత్త ప్రమాణాలు సృష్టించిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఎక్కడ ఉందీ బంగ్లా?
ఈ అత్యంత ఖరీదైన భవనం ముంబై నగరంలోని  ప్రముఖుల నివాసాలకు ప్రసిద్ధిగాంచిన హై–ఎండ్‌ లోకాలిటీ పాలి హిల్‌ ప్రాంతంలో ఉంది. ఈ లగ్జరీ ప్రాపర్టీ ధర రూ. 250 కోట్ల వరకు ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. అంటే ఇది షారుఖ్‌ ఖాన్‌ మన్నత్‌ కంటే ఖరీదైన ప్రాపర్టీ అవుతుంది. ఎందుకంటే మన్నత్‌ విలువను 200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీంతో ఈ తాజా కొనుగోలు ముంబై రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌కు పెద్ద ప్రోత్సాహంగా మారింది. ప్రముఖుల ఇళ్ల ఖరీదు ఇప్పటివరకు 100–150 కోట్ల మధ్యే ఉండగా, ఈ డీల్‌  మార్కెట్‌ను మరింత ఎగబాకేలా చేసింది. ముంబై నగరంలో ఇదొక కొత్త చరిత్రగా నిలిచింది.

ఎవరీ జంట?
ఈ భవనాన్ని కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన బాలీవుడ్‌ స్టార్‌ జంట రణబీర్‌ కపూర్, ఆలియా భట్‌. వీరి కొత్త బంగ్లా మన్నత్‌ కంటే ఖరీదైనది కాగా  ఈ బంగ్లా కొనుగోలు తమకు పెద్ద గౌరవంగా భావిస్తున్నామని రణబీర్‌–ఆలియా సన్నిహితులతో అంటున్నారని  సమాచారం. ఎంతో స్పెషల్‌గా నిర్మించిన ఇంట్లో పర్సనల్‌ జిమ్, ప్రైవేట్‌ థియేటర్,  హైసెక్యూరిటీ వగైరాలతో పాటు అత్యంత ఆధునిక సదుపాయాలు అన్నీ ఉన్నాయట. ఈ  ఇంటిని కేవలం ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం కాకుండా, రణబీర్‌–ఆలియా తమ ఫ్యామిలీతో నివసించడానికి ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. వారి కుమార్తె రాహా కోసం కూడా అనేక సదుపాయాలు ఇంట్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ స్టార్‌ జంట కొత్త ఇంట్లోకి త్వరలోనే గృహ ప్రవేశం చేయనుంది.

Videos

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)