Breaking News

మహిళా అభిమాని దురుసుతనం.. స్టార్‌ సింగర్‌కు గాయం!

Published on Tue, 05/09/2023 - 16:11

బాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌ అర్జిత్‌సింగ్‌తో ఓ మహిళా అభిమాని దురుసుగా ప్రవర్తించింది. స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తున్న సమయంతో అతని చేయి పట్టుకొని గట్టిగా కిందకు లాగింది. దీంతో అతని చేయి బెణికింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అర్జిత్‌ సింగ్‌ సినిమా పాటలే కాకుండా ప్రైవేట్‌ సాంగ్స్‌, కాన్సర్ట్‌ నిర్వహిస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా మహారాష్ట్రలో ఔరంగాబాద్‌లోని రిద్ధి సిద్ధి ల్యాండ్‌మార్క్‌లో అర్జిత్ సింగ్ లైవ్‌ కాన్సర్ట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో అర్జిత్‌ పలు పాటలు ఆలపిస్తూ అందరిని అలరించాడు. అలాగే మధ్య మధ్యలో స్టేజికి దగ్గరగా ఉన్న అభిమానులతో ముచ్చటిస్తూ వారికి షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ వచ్చారు.

(చదవండి: 'ఆదిపురుష్‌' ట్రైలర్‌.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న డైలాగ్స్‌)

ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని అర్జిత్‌కి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ చేతిని గట్టిగా కిందకు లాగింది. దీంతో అర్జిత్‌ అదుపు తప్పి కిందపడబోయాడు. అనుకోకుండా జరిగిన ఈ పరిణామంతో అతని చేయికి గాయమైంది. దీంతో ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. ఆమెకు సున్నితంగా హెచ్చరించారు.

(చదవండి: నా జీవితంలో సామ్‌తో గడిపిన దశ అంటే ఎంతో గౌరవం: నాగచైతన్య)

‘మీరు చేసిన పనికి నా చేతులు వణుకుతున్నాయి. మీరు మీ సమయాన్ని సరదాగా గడపడానికి ఇక్కడికి వచ్చారు. నేను ప్రదర్శన ఇవ్వకపోతే మీకు ఆనందం ఎక్కడ నుంచి వస్తుంది. మీరు నన్ను లాగారు. ఇప్పుడు నా చేతులు వణుకుతున్నాయి. నేను చేయిని కదపలేకపోతున్నాను’ అని అన్నాడు. దీంతో సదరు మహిళ ఆర్జిత్‌కు క్షమాపణలు చెప్పింది. తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్పేందుకు ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.  తెలుగులో అర్జిత్‌ ‘స్వామి రారా’, ‘దోచేయ్’, ‘హుషారు’, ‘ఉయ్యాల జంపాల’, ‘భలే మంచి రోజు’ తదితర సినిమాల్లో పాటలు పాడారు. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?