Breaking News

బాంబ్‌ పేలుడు.. గాయాలపాలైన కేజీఎఫ్‌ విలన్‌

Published on Wed, 04/12/2023 - 16:57

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ గాయాలపాలయ్యాడు. కేడీ అనే కన్నడ సినిమా షూటింగ్‌లో బాంబ్‌ పేలడంతో అతడికి గాయాలయ్యాయి. బుధవారం నాడు బెంగుళూరులోని మగడి రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పాన్‌ ఇండియాగా తెరకెక్కుతున్న కేడీ మూవీలో ఫైట్‌ మాస్టర్‌ రవి వర్మ ఆధ్వర్యంలో బాంబు బ్లాస్ట్‌ ఫైట్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా అకస్మాత్తుగా బాంబు పేలడంతో సంజయ్‌ మోచేయి, ముఖానికి గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స తీసుకున్న అనంతరం ఆయన ముంబై వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేశారు.

కాగా 1971లో వచ్చిన 'రేష్మ ఔర్‌ షేరా' సినిమాతో బలనటుడిగా కెరీర్‌ ఆరంభించాడు సంజయ్‌ దత్‌. ఈ సినిమా వచ్చిన పదేళ్ల తర్వాత 'రాకీ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. జానీ ఐ లవ్యూ, విధాత, నామ్‌, జాన్‌ కీ బాజీ, మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌, లగే రహో మున్నా భాయ్‌.. ఇలా అనేక చిత్రాల్లో నటించాడు. హిందీ చిత్రపరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్ధాలుగా నటుడిగా రాణించాడు. కేజీఎఫ్‌ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కేజీఎఫ్‌ 2 సినిమాల్లో విలన్‌గా నటించి దక్షిణాది వారికి మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఆయన ధృవ్‌ సర్జా హీరోగా చేస్తున్న కేడీలో నటిస్తున్నారు. ఇదే కాకుండా ద గుడ్‌ మహారాజ, గుడ్చడి, లియో, బాప్‌ సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)