Breaking News

ఆడవారి కష్టానికి అద్దం ఈ సినిమా..

Published on Mon, 02/24/2025 - 00:07

ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో హిందీ చిత్రం మిసెస్‌(Mrs) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

ఈ సమాజంలో ఏ ప్రతిఫలం ఆశించకుండా ప్రతి రోజూ బాధ్యతతో కష్టపడుతున్న వారెవరైనా ఉన్నారు అంటే వారు మన ఇంటి ఆడవారు. 365 రోజులు ఏ సెలవు లేకుండా ఇంట్లో ఉన్న ఆరు నుండి అరవై ఏళ్ల వాళ్ల బాగోగులు ప్రతి నిత్యం అలుపెరగకుండా చూసుకునేవారే ఆడవారు. మరి ఇంతలా కష్టపడుతున్న వారికి కొన్ని బాధలు ఉంటాయి కదా. వాటి గురించి విచారించేదెవరు... ఆ కోణంలో ఆలోచింపజేసేదే ఈ ‘మిసెస్‌’ చిత్రం.

2021లో విడుదలైన మలయాళ సినిమా ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’కి హిందీ రీమేక్‌గా ‘మిసెస్‌’ రూపొందింది. ఆరతి కడావ్‌ దీనికి దర్శకురాలు. బాలీవుడ్‌లో విలక్షణ నటిగా పేరొందిన సాన్యా మల్హోత్రా(Sanya Malhotra) ఈ సినిమాలోని ప్రధాన పాత్ర పొషించారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కనీసం ఓ క్షణమైనా తమ ఇంటి ఆడవారి కష్టం గురించి ఆలోచిస్తారు. అలా ఆలోచింపజేయడమే లక్ష్యంగా దర్శకురాలు ఈ సినిమాని రూపొందించారు. అంతలా ఏముందీ సినిమాలో ఓసారి చూద్దాం... రీచా ఓ చదువుకున్న ఆధునిక భావాలు కలిగిన అమ్మాయి. మంచి డ్యాన్స్ టీచర్‌ కూడా.

తనకు సొంతంగా డ్యాన్స్ టీమ్‌ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలో ఉంటుంది. ఈ లోపల తల్లిదండ్రులు నిశ్చయించిన సంబంధంతో పెద్దల సమక్షంలో సంప్రదాయబద్ధంగా దివాకర్‌తో పెళ్లవుతుంది. దివాకర్‌ ఓ డాక్టర్‌. దివాకర్‌ది మరీ ఛాందస భావాలు కలిగిన కుటుంబం. ఇంటికి వచ్చిన కోడలితో ఇంటెడు చాకిరీ చేయించుకోవడమే కాక ఓ బానిస కన్నా చాలా హీనంగా చూస్తుంటారు.  ప్రతి రోజూ అలారం పెట్టుకొని లేచి ఇంట్లో ఉన్న వాళ్లందరికీ వండి రాత్రి మళ్లీ నిద్రపొయేంతవరకు కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకురాలు. ఇంట్లో కనీసం వాసన కూడా భరించలేని ఓ ప్రదేశాన్ని తాను ఎంత నరకయాతన అనుభవిస్తూ శుభ్రం చేసిందో చూస్తే చూసిన ప్రేక్షకులకు గుండె బరువెక్కుతుంది.

ఇంటి పెద్ద అయిన దివాకర్‌ తండ్రి బయటకు వెళ్లాలంటే ఆయన చెప్పులు కూడా చేత్తో తీసి, ముందు పెడితే తాపీగా వేసుకుని వెళతాడు. అటువంటి ఘోరమైన భావజాలమున్న ఈ కుటుంబంలోకి వచ్చిన రీచా ఎలా మనగలుగుతుంది? అలాగే తన డ్యాన్స్ డ్రీమ్‌ నెరవేర్చుకుంటుందా? లేదా అన్నది సినిమాలోనే చూడాలి. ఈ సినిమాలోని కథాంశం సమాజంలో ఉన్న ప్రతి గృహిణిది. ప్రతి రోజూ మీ కోసం కష్టపడుతున్న మీ వారి కోసం ఈ సినిమా చూడండి. ఆమె కష్టమేంటో మీ మనస్సుతో పాటు కళ్లకు కూడా తెలుస్తుంది. వర్త్‌ఫుల్‌ వాచ్‌. 
– ఇంటూరు హరికృష్ణ 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)