Breaking News

వీడియో షేర్‌ చేస్తూ 'సాయి పల్లవి'ని టార్గెట్‌ చేస్తుందెవరు..?

Published on Sat, 10/26/2024 - 16:26

శివ కార్తికేయన్‌- సాయిపల్లవి జోడిగా నటించిన 'అమరన్‌' తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 31న విడుదలవుతోంది. మేజర్ ముకుందన్ జీవితంలోని కొన్ని సంఘటనలను తీసుకుని ఈ చిత్రాన్ని పూర్తి ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు   రాజ్‌కుమార్‌ పెరియస్వామి తెరకెక్కించాడు. అయితే, ఈ సినిమా విడుదల నేపథ్యంలో కొందరు సాయిపల్లవిని టార్గెట్‌ చేస్తూ నెట్టింట తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

సాయి పల్లవి నటించిన  'విరాట పర్వం' సినిమా వచ్చి రెండేళ్లు దాటింది. అయితే, ఆ  సమయంలో ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ నుంచి కొంత భాగాన్ని కట్‌ చేసి కొందరు ఇప్పుడు వైరల్‌ చేస్తున్నారు. నక్సల్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గురించి ఆమె ఇలా చెప్పారు. 'పాకిస్తాన్‌లో ఉన్న వాళ్లు.. మన జవాన్లు టెర్రరిస్ట్‌లు అని అనుకుంటారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం.. వాళ్లకు ఏమైనా హాని చేస్తామని భావిస్తారు. అదే సమయంలో మనకు కూడా వాళ్లు అలానే కనిపిస్తారు. ఈ రెండింటి మధ్య మనం చూసే విధానం మారిపోతుంది. ఇందులో ఎవరు రైట్..? ఎవరు రాంగ్..? అని నేను చెప్పలేను.’ అని ఆమె అన్నారు.  ఇప్పుడు ఈ వీడియోను కొందరు పనికట్టుకొని సోషల్ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. మన జవాన్లను టెర్రరిస్ట్‌లతో పోల్చిందంటూ ఆమెను తప్పు పడుతున్నారు.

బాలీవుడ్‌ వాళ్లే టార్గెట్‌ చేస్తున్నారా..?
'అమరన్‌' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా సాయి పల్లవి మాట్లాడుతూ..  బాలీవుడ్‌ నుంచి ఓ వ్యక్తి వచ్చి తన ఇమేజ్‌ను మరింత పెంచుతామంటూ పీఆర్‌ ఏజెన్సీ వారు సంప్రదించారని తెలిపింది. అయితే, దానిని తాను రిజక్ట్‌ చేశానని ఆమె చెప్పారు. అలాంటి అవసరం తనకు లేదని చెప్పినట్లు  తెలిపారు. దీంతో ఇప్పుడు వారే సాయి పల్లవిని టార్గెట్‌ చేస్తున్నారని తెలుస్తోంది.  ‘రామాయణ’ సినిమాతో బాలీవుడ్‌కి ఆమె ఎంట్రీ ఇస్తున్నారు. కొందరు ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. సీత పాత్రలో సాయి పల్లవిని తొలగించాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలా కావాలనే బాలీవుడ్‌ పీఆర్‌ టీమ్‌ వాళ్లు సాయి పల్లవిని టార్గెట్‌ చేశారని తెలుస్తోంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)