Breaking News

నిశ్చితార్థం చేసుకున్న బాలీవుడ్ నటి.. పిక్స్ వైరల్

Published on Wed, 03/01/2023 - 21:08

బాలీవుడ్‌లో పెళ్లిల్ల సందడి కొనసాగుతోంది. కొత్త ఏడాది ప్రారంభంలోనే కేఎల్ రాహుల్- అతియాశెట్టి, కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా జంటలు వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ నటి ఎంగేజ్‌మెంట్‌  చేసుకున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

స్విని నిమేష్ ఖరా టీవీ షో బా బహూ ఔర్ బేబీలో కొంటె చైతాలి పాత్రకు గుర్తింపు తెచ్చుకుంది. 2007లో వచ్చిన అమితాబ్-టబు నటించిన చిత్రం చీనీ కమ్‌లో పోషించిన పాత్రకు ప్రసిద్ధి చెందింది. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా  స్విని ఖరా నటించింది. ఈ చిత్రంలో బిగ్ బికి మంచి స్నేహితురాలిగా కనిపించింది. స్వినీ ఖరా సోషల్ మీడియా ద్వారా తన నిశ్చితార్థం అయినట్లు ప్రకటించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను  తన ఇన్‌స్టాలో పంచుకుంది.

ఇది చూసిన ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ఆమె స్నేహితులతో పాటు  అవికా గోర్, నవికా కోటియా నూతన జంటకు కంగ్రాట్స్ చెప్పారు.  కాగా.. స్విని ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రంలో భాగమైంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ఈ చిత్రంలో స్వినీ.. జయంతి అనే పాత్రను పోషించింది. ఆమె బా బహూ ఔర్ బేబీ, దిల్ మిల్ గయే, సీఐడీ, జిందగీ ఖట్టి మీథీ వంటి టీవీ షోలలో కూడా పనిచేసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)