Breaking News

హీరోల వయసు గురించి ఎందుకు మాట్లాడరో?

Published on Fri, 01/24/2025 - 02:55

చిత్ర పరిశ్రమలో వయసనేది పెద్ద సమస్యే కాదని నటి మనీషా కొయిరాలా(Manisha Koirala) అంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ– ‘‘చిత్ర పరిశ్రమలోని సీనియర్‌ నటీమణులకు ముఖ్యమైన పాత్రలు చేసే అవకాశం ఇవ్వాలి. వయసు, వృద్ధాప్యం అనేది సినిమా ఇండస్ట్రీలో పెద్ద సమస్య కాదు. కానీ, ఇది పరిష్కరించాల్సిన సామాజిక సమస్య.

ఎందుకంటే చిత్ర పరిశ్రమలో హీరోల వయసు గురించి ఎవరూ మాట్లాడరు. హీరోల ఏజ్‌పై కామెంట్స్‌ చేయడం నేనిప్పటి వరకూ వినలేదు. ఏజ్‌ విషయంలో కేవలం నటీమణులను మాత్రమే ఎందుకు ట్రోల్‌ చేస్తారో అర్థం కావడం లేదు. సీనియర్‌లకు తల్లి పాత్రలో లేక సోదరి పాత్రలో ఇద్దామనుకుంటున్నారు. మహిళలు ఎలాంటి పాత్రలైనా చేయగలరు. యాక్షన్‌ పాత్రలని కూడా సులభంగా చేయగలరు.

గతంలో ఎంతో మంది సీనియర్‌ నటీమణులు ఈ విషయాన్ని నిరూపించారు. నేను కూడా ఇప్పటికీ ఎలాంటి పాత్ర అయినా సవాల్‌గా స్వీకరిస్తాను. కొత్త పాత్రలు చేసి నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను. ఏజ్‌ అనేది జస్ట్‌ నంబర్‌ మాత్రమే. యాభై సంవత్సరాలు దాటినా మంచి జీవితాన్ని గడపగలం. అసలు వయసనేది సమస్య కాదని ప్రపంచానికి చాటి చెప్పాలి. ఈ విషయంలో భవిష్యత్‌ తరాలకు మార్గదర్శిగా నిలవాలి. నేను జీవించి ఉన్నంత వరకు ఆరోగ్యంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండాలనుకుంటున్నా.. ఇదే ఆశయంతో జీవిస్తున్నాను’’ అన్నారు.

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)