Breaking News

లోకేష్‌ కనకరాజ్‌తో బాలీవుడ్‌ బ్యూటీ

Published on Fri, 10/31/2025 - 06:29

కోలీవుడ్‌ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ పేరు భారీ చిత్రాలకు బ్రాండ్‌గా మారిన విషయం తెలిసిందే. మానగరం వంటి చిన్న చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించి, తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత కార్తీతో ఖైదీ, విజయ్‌తో మాస్టర్, లియో ఆపై కమలహాసన్‌ కథానాయకుడిగా విక్రమ్, రజనీకాంత్‌ హీరోగా కూలీ తదితర భారీ యాక్షన్‌ కథా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఒక్క చిత్రం ఆశించిన విజయం సాధించకపోతే ఇంతకు ముందు ఎన్ని సూపర్‌ హిట్‌ చిత్రాలను అందించినా అవి లెక్కలోకి రావన్నది దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌కు వర్తిస్తుంది. 

ఈయన తాజాగా తెరకెక్కించిన కూలీ చిత్రం అంచనాలను చేరుకోలేకపోయింది. అంతే లోకేష్‌ కనకరాజ్‌పై ట్రోలింగ్స్‌ వైరల్‌ కావడం మొదలెట్టాయి. అంతే కాదు హిందీలో షారూఖ్‌ ఖాన్‌తో చేయాల్సిన చిత్రం డ్రాప్‌ అయ్యిందనే ప్రచారం వైరల్‌ అయ్యింది. అదే విధంగా కమలహాసన్, రజనీకాంత్‌ కలిసి నటించే చిత్రానికి లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు అదీ చేజారి పోయింది. ప్రస్తుతం లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వానికి చిన్న బ్రేక్‌ ఇచ్చి నటనపై దృష్టి పెట్టారు. 

లోకేష్‌ హీరోగా నటిస్తున్న చిత్రానికి కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రం ఫేమ్‌ అరుణ్‌ మాదేశ్వరన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే మొదలై నిర్మాణంలో ఉంది. ఇది గ్యాంగ్‌స్టర్‌ నేపధ్యంలో సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం కోసం లోకేష్‌ కనకరాజ్‌ చాలా కసరత్తులు చేసి పాత్రకు తగినట్లు తనను తాను మలచుకున్నట్లు తెలిసింది. ఇకపోతే ఇందులో ఆయనకు జంటగా నటించే నాయకి ఎవరన్న ప్రశ్నకు సమాధానం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. హిందీ బ్యూటీ వామిక కబి(Wamiqa Gabbi) ఈ చిత్రంలో నాయికగా నటిస్తున్నట్లు తెలిసింది. ఈ భామ ఇంతకు ముందు మాల్‌ నేరత్తు మయక్కమ్‌ చిత్రంలో నటించారన్నది గమనార్హం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి కల్లా పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. తదుపరి కార్తీ హీరోగా ఖైదీ–2 చేయడానికి లోకేష్‌ కనకరాజ్‌ రెడీ అవుతారని సమాచారం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)