ఛావాపై వివాదాస్పద ట్వీట్.. హీరోయిన్‌పై ఓ రేంజ్‌లో నెటిజన్స్ ఫైర్!

Published on Wed, 02/19/2025 - 19:05

బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌ చేసిన ట్వీట్స్‌ వివాదానికి దారితీశాయి. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన తాజా చిత్రం ఛావా గురించి ఆమె చేసిన పోస్టులపై నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మహాకుంభ్‌ మేళాలో జరిగిన తొక్కిసలాటను పోలుస్తూ ఛావా మూవీపై విమర్శలు చేసింది. ఇటీవల జరిగిన తొక్కిసలాట కంటే దాదాపు 500 ఏళ్ల క్రితం హిందువులను హింసించినట్లు కల్పిత కథలనే ప్రజలు నమ్ముతారంటూ స్వర భాస్కర్ ట్వీట్ ‍చేశారు. అంతేకాకుండా అలాంటి వాటిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అది కాస్తా వివాదానికి దారితీయడంతో నటిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్స్.

స్వర భాస్కర్‌ చేసిన పోస్ట్‌పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి మన వీరుల చరిత్రతో ఆటలు ఆడుకోవద్దని సూచిస్తున్నారు. ఓ నెటిజన్‌ ఆమెకు రిప్లై ఇస్తూ.. నేను ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్రను అభ్యసించా. ఔరంగజేబ్ చేతిలో శంభాజీ మహరాజ్‌ చిత్రహింసలతోనే మృతి చెందారనడంలో ఎలాంటి కల్పితాలు లేవు. దయచేసి మీ ఆలోచన విధానంపై ఒకసారి పునరాలోచించుకోండి అంటూ చురకలంటించాడు. 

(ఇది చదవండి: ఛావా ప్రభంజనం.. శివాజీ సినిమా వస్తే ఏమైపోతారో?)

హిందువులపై ఔరంగజేబ్‌ చిత్రహింసలను కల్పితం అనడం.. శంభాజీ మహరాజ్‌ ప్రాణత్యాగాన్ని తక్కువ చేసి మాట్లాడేందుకు మీకెంత ధైర్యం? ఛత్రపతి శివాజీ జయంతి రోజున మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. కోట్లాది మంది భారతీయుల మనోభావాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని ఓ నెటిజన్ స్వర భాస్కర్‌పై మండిపడ్డాడు. ఛత్రపతి శంభాజీ రాజ్ అనుభవించిన హింసలో ఒక భాగాన్ని ఈ చిత్రంలో చూపించలేదని మరో నెటిజన్‌ రాసుకొచ్చాడు. కాగా.. నటి  స్వర భాస్కర్‌.. ఫహాద్‌ ఆహ్మద్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలాసార్లు తన వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలుస్తూనే ఉంది..

బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఛావా.  మడాక్ ఫిలింస్ పతాకంపై దినేష్ విజన్ నిర్మించారు. శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శంభాజీగా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించగా.. రష్మిక మందన్న మహారాణి యేసుబాయిగా కనిపించింది. అక్షయ్ ఖన్నా ఔరంగజేబ్‌ పాత్రలో నటించారు. ఈ చిత్రం శివాజీ సావంత్ రచించిన మరాఠీ నవల 'ఛావా' ఆధారంగా రూపొందించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)