Breaking News

కూతురిపై డేటింగ్ రూమర్స్.. తనకేలాంటి బాధలేదన్న హీరోయిన్

Published on Mon, 12/30/2024 - 19:01

బాలీవుడ్ నటి శ్వేత తివారీ గురించి పరిచయం అక్కర్లేదు. బీటౌన్‌లో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. ఆమె కూతురు పాలక్ తివారీ సైతం సినిమాల్లోకి అడుగుపెట్టింది. శ్వేత వారసురాలిగా బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. గతేడాది సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ మూవీలో కనిపించింది.

డేటింగ్ రూమర్స్..

అయితే పాలక్ తివారీపై గతంలో చాలాసార్లు డేటింగ్ రూమర్స్ వినిపించాయి. సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోలింగ్‌ కూడా చేశారు. సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌తో డేటింగ్‌లో చేస్తున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తన కూతురిపై వచ్చిన డేటింగ్ రూమర్స్‌పై ఆమె తల్లి శ్వేత తివారీ తాజా ఇంటర్వ్యూలో స్పందించింది. అయితే అవన్నీ కేవలం నాలుగు గంటలు మాత్రమే ఉంటాయని.. ఆ తర్వాత వాళ్లే మర్చిపోతారంటూ కొట్టిపారేసింది.

శ్వేత తివారీ మాట్లాడుతూ..' తన కూతురిపై వస్తున్న రూమర్స్  నన్ను బాధించవు. ఎందుకంటే అవీ కేవలం 4 గంటలు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత వాళ్లే వార్తలను మరచిపోతారు. అందుకే వాటి గురించి బాధపడటం ఎందుకు?. అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి ఇంటర్నెట్‌లో తరచుగా ఊహాగానాలు వస్తున్నాయి. తాను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ కూడా వినిపించాయి. అలా రూమర్స్ ప్రకారం నాకు ఇప్పటికే మూడు వివాహాలు జరిగాయి. అయినప్పటికీ ఇలాంటి విషయాలు నన్ను ప్రభావితం చేయలేవు. ఇంతకుముందు సోషల్ మీడియా లేనప్పుడు కొంతమంది జర్నలిస్టులు నా గురించి మంచి విషయాలు రాసేందుకు ఎప్పుడూ ఇష్టపడలేదు. నటీనటుల గురించి నెగెటివ్ రాస్తేనే వాళ్ల మార్కెట్‌ నడుస్తుంది. ఇవన్నీ నన్ను ఏ విధంగానూ ప్రభావితం చేయలేవు" అని తెలిపింది. అయితే తన కుమార్తె పాలక్ తివారీపై నెగెటివ్ ప్రచారం పట్ల ఒక తల్లిగా ఆందోళన చెందుతున్నట్లు అంగీకరించింది.

మొదట తనపై వచ్చే ట్రోల్‌లను డీల్ చేసిన పాలక్‌ తివారీని చూసి వాటిని హ్యాండిల్ చేయడం నేర్చుకున్నానని శ్వేత తివారీ వివరించింది. ఎలాంచి రూమర్స్ వచ్చినా తన కూతురు బలంగా ఉన్నప్పటికీ అది కొన్నిసార్లు తనను భయపెడుతుందని తెలిపింది. నా కూతురు చాలా అమాయకంగా ఉంటుందని.. తనపై వస్తున్న రూమర్స్‌కు తిరిగి స్పందించదని వెల్లడించింది. ఆ సమయంలో ఒక తల్లిగా నాపై కొంత ప్రభావం ఉంటుందని శ్వేత చెప్పుకొచ్చింది. ఒకసారి నా స్నేహితులతో కూర్చుని మాట్లాడుతుండగా..  మా అమ్మ దేనికీ భయపడదని పాలక్ చెప్పిందని గుర్తు చేసుకుంది. కాగా.. శ్వేతా తివారీ చివరిసారిగా మిత్రన్ దా నా చల్దా, ఉమానియా, ఇండియన్ పోలీస్ ఫోర్స్‌ చిత్రాల్లో కనిపించారు.
 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)