Breaking News

పాపం.. ఇక అదృష్టం లేదేమో.. ఐదోసారి నటికి హార్ట్‌ బ్రేకింగ్‌!

Published on Fri, 12/20/2024 - 14:59

ఈ సమాజంలో ఏ మహిళకైనా ఒక్కసారైనా అమ్మ అని పిలిపించుకోవాలని ఉంటుంది. అందుకోసమే పిల్లల కోసం తెగ ఆరాటపడుతుంటారు. కానీ గర్భధారణలో వచ్చే ఇబ్బందుల వల్ల చాలామంది ఐవీఎఫ్‌, సరోగసీ పద్ధతుల ద్వారా పిల్లలను కనేందుకు యత్నిస్తుంటారు. ప్రస్తుత సరోగసీ అనే పద్ధతి చాలా వరకు సాధారణ ప్రక్రియగా మారిపోయింది.

అయితే ప్రముఖ బాలీవుడ్‌ నటి, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ సంభావన సేత్ సైతం పిల్లల కోసం తెగ ఆరాటపడుతోంది. అందుకే ఇన్‌వెట్రో ఫెర్టిలైజేషన్‌(ఐవీఎఫ్‌)ను ఆశ్రయించారు. ఇప్పటికే నాలుగుసార్లు ఐవీఎఫ్‌ ప్రక్రియ ఫెయిల్ అయినప్పటికీ మరోసారి ప్రయత్నించారు బాలీవుడ్ నటి. అయితే ఐదోసారి కూడా ఆమెకు నిరాశే మిగిలింది.

ప్రెగ్నెన్సీ ధరించిన మొదటి త్రైమాసికంలోనే గర్భస్రావం అయిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది సంభావన. తన భర్తతో కలిసి యూట్యూబ్ ఛానెల్ ద్వారా బాధను వ్యక్తం చేసింది. తాము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ 12 వారాల ఇలా జరిగిందని బోరున ఏడ్చేసింది. నటి భర్త అవినాష్ ద్వివేది సైతం తాము గుడ్‌ న్యూస్‌ చెప్పాలనుకుంటే.. ఇలా జరిగిపోయిందని విచారం వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని ప్రకటిస్తూ సంభవనా ఎమోషనలైంది. మా బిడ్డను రక్షించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించింది. మూడు నెలల్లో 65 ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వచ్చిందని నటి తెలిపింది.  కానీ చాలా ఇంజెక్షన్లు తీసుకోవలసి ఉంటుందని నాకు తెలియదు.. ఇది తలచుకుంటే చాలా బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ప్రతిరోజూ 2-3 సార్లు ఇంజెక్షన్స్‌ ఇచ్చేవారని.. మేము మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా  మా ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదని ఆమె భర్త అవినాశ్ బాధపడ్డారు.

కాగా..గతంలోనూ ఈ జంట ఐవీఎఫ్‌కు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇది ఐదోసారి కావడంతో వారిని తీవ్ర మనో వేదనకు గురి చేసింది. గతంలో ఐవీఎఫ్ ఆధునిక పద్ధతి వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ బారిన పడినట్లు నటి వివరించింది. అంతేకాకుండా ర్యూమటాయిడ్‌ ఆర్థరైటిస్‌తో సతమతమవుతున్నట్లు తెలిపింది.. తన బాధను అభిమానులతో పంచుకుంటూ కంటతడి పెట్టుకుంది.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)