Breaking News

'వారికి ఆనందమైతే మనమేం చేస్తాం'.. ట్రోల్స్‌పై బుల్లితెర నటి రియాక్షన్‌

Published on Sun, 04/13/2025 - 15:54

బాలీవుడ్ భామ, బుల్లితెర నటి మౌనీ రాయ్ తెలుగువారికి సైతం సుపరిచితమైన పేరు. నాగిని సీరియల్‌తో తెలుగులోనూ ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పుడు టచ్‌లోనే ఉంటుంది. ఎక్కడికెళ్లినా ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటోంది. ‍అయితే సన్నగా.. మరింత అందంగా కనిపించే మౌనీ రాయ్‌.. ఇటీవల ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని వార్తలొచ్చాయి. ఆమె ఇన్‌స్టా కొన్ని ఫోటోలు, వీడియోలు షేర్ చేయగా తనపై నెట్టింట విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. తాజా ఈవెంట్‌లో తనపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది ఈ బుల్లితెర నటి.

తాజాగా 'ది భూత్నీ' అనే మూవీలో నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌ను ముంబయిలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన ముద్దుగుమ్మ తనపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది. ఇలాంటి నీచమైన కామెంట్స్‌ చేస్తూ ఆనందం పొందే వారి ట్రోల్స్‌ను తాను అస్సలు పట్టించుకోనని మౌనీ రాయ్ తెలిపింది. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులుగా తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చిపడేసింది.

మౌనీ రాయ్ మాట్లాడుతూ.. "ట్రోల్స్ వల్ల నాకు ఎలాంటి బాధ లేదు. నేను అలాంటి వాటిని చూడను కూడా. ప్రతి ఒక్కరూ వారి పనిని చేయనివ్వండి. నేను అలాంటి వ్యాఖ్యలను అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇతరులను ట్రోల్ చేయడానికి మీరు తెర వెనుక దాక్కుని.. వాటితో ఆనందాన్ని పొందితే మనమే చేస్తాం. అలాంటి వారిని  అలానే ఉండనివ్వండి" అంటూ కామెంట్స్ చేసింది.

కాగా.. మౌనీ రాయ్ ప్రస్తుతం హారర్ యాక్షన్ కామెడీ చిత్రం 'ది భూత్నీ'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆమె మొహబ్బత్ అనే దెయ్యం పాత్రలో కనిపించనుంది. ఈ మూవీలో సంజయ్ దత్, సన్నీ సింగ్, పాలక్ తివారీ, బెయోనిక్, ఆసిఫ్ ఖాన్‌ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'ది భూత్నీ' ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా అక్షయ్ కుమార్ 'కేసరి- 2'తో  బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)