ఎమర్జెన్సీకి లైన్‌ క్లియర్‌.. విడుదల తేదీపై ఉత్కంఠ!

Published on Thu, 10/17/2024 - 18:47

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా 'ఎమర్జెన్సీ'. ఇప్పటికే జూలైలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. గతనెల సెప్టెంబర్‌ 6న థియేటర్లలోకి వస్తుందని భావించినప్పటికీ.. ఊహించని విధంగా మరోసారి పోస్ట్‌పోన్‌ అయింది. దీంతో ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం లేదని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు.

తాజాగా తన అభిమానులకు కంగనా రనౌత్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్‌ బోర్డు సర్టిఫికేట్ జారీ చేసినట్లు ట్విటర్ ద్వారా ప్రకటించింది. మా చిత్రబృందం సెన్సార్‌ పూర్తి చేసుకుందని.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఈ విషయంలో మీ సహనానికి, మద్దతుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది.

(ఇది చదవండి: కంగనా ఎమర్జెన్సీ.. రిలీజ్‌కు మోక్షం అప్పుడేనా?)

కాగా.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జన్సీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో ఈ మూవీపై ఓ వర్గం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను చెడుగా చిత్రీకరించారంటూ ఈ చిత్రంపై ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా సెన్సార్ బోర్డ్ సైతం కొన్ని సీన్స్‌ కట్‌ చేయాలని చిత్రబృందానికి సూచించింది. అందువల్లే ఎమర్జెన్సీ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకోవడంతో త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. 
 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)