"ఎవడైతే నాకేంటి" లో నటించమని వైఎస్ జగన్ గారిని అడిగితే, ఏమన్నారంటే..!
Breaking News
'ముంబయిలో ఆడిషన్.. సౌత్ డైరెక్టర్ చాలా అసభ్యంగా..'
Published on Thu, 04/16/2026 - 19:36
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం కొత్త కాదు. ఇండస్ట్రీలోకి వచ్చినవారిలో చాలామందికి దాదాపు ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఈ విషయాన్ని కొందరు హీరోయిన్స్ బయటికి చెబుతుంటారు. మరికొందరు తమ బాధను చెప్పేందుకు భయపడుతూ ఉంటారు. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వ సాధారణమైపోయింది.
తాజాగా మరో హీరోయిన్ తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. బాలీవుడ్ బ్యూటీ డైసీ షా తాను ఎదుర్కొన్న సంఘటనను వివరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ.. దక్షిణాది డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. కాస్టింగ్ సెషన్ జరుగుతున్నప్పుడు.. అనుచితంగా తన శరీరాన్ని తాకాడని వెల్లడించింది. ఆ సమయంలో తాను చాలా ఇబ్బందికి గురయ్యానని పేర్కొంది. ముంబయిలో జరిగిన క్యాస్టింగ్ మీట్‌లో ఈ సంఘటన జరిగిందని పంచుకుంది.
డైసీ షా మాట్లాడుతూ..'దక్షిణాదికి చెందిన ఒక డైరెక్టర్ నన్ను చాలా అసభ్యంగా తాకారు. ఆయన కాస్టింగ్ కోసం ఓసారి ముంబైకి వచ్చారు. అతన్ని కలవడానికి ఆరు నుంచి ఏడుగురు అమ్మాయిలం వెళ్లాం. అక్కడ ఆయన మమ్మల్ని ఒక్కొక్కరిని విడివిడిగా కలుస్తున్నారు. అది నాకు నచ్చలేదు. ఆ సమయంలో నా శరీరాన్ని తాకారు.. నా చేయి కూడా పట్టుకున్నారు. నన్ను ఎవరైనా తాకితే చాలా భయంగా ఉంటుంది. అందుకే నేను మసాజ్ కూడా చేయించుకోను. ఒక మహిళ కూడా నన్ను తాకడం ఇష్టం లేదు. అదే ఒక పురుషుడు నన్ను తాకితే ఎలా ఉంటుంది. అందుకే నాకు అది నచ్చలేదు. ఆ తర్వాత అతనికి తిరిగి ఫోన్ చేస్తానని చెప్పా. కానీ చేయలేదు' అని వెల్లడించింది. అయితే ఆ డైరెక్టర్ ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
కాగా.. డైసీ షా.. సల్మాన్ ఖాన్ సరసన 'జై హో' (2014) చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'హేట్ స్టోరీ 3' (2015)లో కనిపించింది. మొదట కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య వద్ద సహాయకురాలిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. 'భద్ర', 'బాడీగార్డ్' వంటి చిత్రాలతో కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటనతో పాటు, డ్యాన్స్ రియాలిటీ షోలలో పాల్గొంది. పలు టెలివిజన్ కార్యక్రమాలలో కనిపించింది. ఇటీవలే 'రెడ్ రూమ్' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం పలాష్ ముచ్చల్ దర్శకత్వంలో వస్తోన్న థ్రిల్లర్ మూవీలో డైసీ హీరోయిన్‌గా నటిస్తోంది.
Tags : 1