వీడియోలు తొలగించండి.. ఢిల్లీ హైకోర్టుకు ఐశ్వర్య రాయ్‌

Published on Tue, 09/09/2025 - 13:05

బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఫోటోలను అనుమతి లేకుండా పలు వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగిస్తున్నారని వెంటనే వాటిని నిర్మూలించాలని  కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. అనుమతి లేకుండానే అనేక వెబ్‌సైట్‌లు తన పేరును ఉపయోగించి పలు వస్తువులను విక్రయిస్తున్నాయని ఆమె పేర్కొంది. AI- జనరేటెడ్ ద్వారా తన పోటోలను మార్ఫింగ్ చేసి వీడియోలను కూడా ప్రసారం చేస్తున్నారని ఐశ్వర్య అన్నారు.

ఐశ్వర్య రాయ్‌ పిటిషన్‌ను జస్టిస్ తేజస్ కరియా నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. ఐశ్వర్య తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సందీప్ సేథి కోర్టులో బలంగానే వాదించారు. ఎటువంటి అనుమతి లేకుండానే ఐశ్వర్య పేరును ఉపయోగించి పలు వస్తువులను అమ్ముతున్న అనేక వెబ్‌సైట్‌ల వివరాలను కోర్టుకు అందించారు. aishwaryaworld.com అనే  ఒక వెబ్‌సైట్‌ను సూచిస్తూ.. ఆమె నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే అది "ఐశ్వర్య రాయ్‌కు సంబంధించిన  అధికారిక వెబ్‌సైట్" అని చెప్పుకుంటున్నారని సేథి అన్నారు.

ఒకరి లైంగిక కోరికలను తీర్చుకోవడానికి ఆమె పేరు, ఫోటోలు ఉపయోగించబడుతున్నాయని  న్యాయవాది సందీప్ సేథి కోర్టులో లేవనెత్తారు.  ఒక పెద్దమనిషి  ఆమె ఫోటోలను మార్ఫింగ్‌ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇది చాలా నీచమైన పని అంటూ న్యాయవాది ఫైర్‌ అయ్యారు. దీంతో న్యాయస్థానం కూడా ఐశ్వర్యకు అనుకూలంగానే స్పందించింది. వివిధ ప్రయోజనాల కోసం ఆమె చిత్రాలను అనధికారికంగా ఉపయోగిస్తున్న వెబ్‌సైట్‌లపై ఇంజక్షన్ ఆర్డర్లు జారీ చేస్తామని ఢిల్లీ హైకోర్టు  తెలిపింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించే URL లింక్‌లను పూర్తిగా తొలగించడానికి తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని జస్టిస్ తేజస్ కరియాతో కూడిన ధర్మాసనం తెలిపింది.
 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)