Breaking News

ఆర్థిక ఇబ్బందులు.. ఆగిపోయిన ప్రాజెక్ట్‌.. అయినా నిలదొక్కుకున్న నటుడు

Published on Fri, 03/21/2025 - 12:31

చిన్నప్పటి నుంచి టీవీల్లో డ్యాన్స్‌ షోలు చూస్తూ డాన్సర్‌ కావాలనుకునేవాడు రోహిత్‌ సరాఫ్‌. వెండితెరపై కుమారుడిని చూడాలని కలలు కనేవాడు అతడి తండ్రి. అయితే తన కల నెరవేరే భాగ్యాన్ని చూడలేదు. రోహిత్‌ పన్నెండేళ్లు ఉన్నప్పుడు  తండ్రి చనిపోయాడు. ‘నాన్న ఆత్మకు శాంతి చేకూరాలంటే నేను నటుడిని కావాల్సిందే’ అని బలంగా డిసైడైపోయాడు రోహిత్‌.

టీవీ షోల నుంచి..
ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన సరాఫ్‌ ఒక టీవీ చానల్‌ యూత్‌ షోకు హాజరయ్యాడు. కెమెరా ముందుకు రావడం కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుగా అనిపించింది. ‘బాగా కష్టపడితేగానీ ఇక్కడ నెగ్గుకు రాలేం’ అనుకున్నాడు. మొదటి సంవత్సరం రెండు టీవీ షోలలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత యాడ్స్‌లో, ఒక సినిమాలో అవకాశం వచ్చింది. అయితే... తొలి సినిమా షూట్‌ చేసిన రెండున్నరేళ్ల తరువాత అది ఆగిపోయిందని తెలుసుకున్నాడు. బాగా నిరాశకు గురయ్యాడు.

ఆర్థిక ఇబ్బందులు..
ఆడిషన్స్‌కు కూడా వెళ్లేవాడు కాదు. దీంతో ఎవరి నుంచి పిలుపు వచ్చేది కాదు. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు. ఆ చీకటి రోజులలో ‘ఇలా అయితే ఎలా?’ అని తనకు తానే ప్రశ్న వేసుకున్నాడు. మళ్లీ కష్టపడాలని గట్టిగా అనుకున్నాడు. ‘ప్రతిరోజూ కొండంత ధైర్యంతో, కోటి కలలతో నిద్ర లేవాలనుకున్నాను’ అని గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు.

డియర్‌ జిందగీ, హిచ్కీ, ది స్కై ఈజ్‌ పింక్‌లాంటి చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. ‘యస్‌...నాకు భవిష్యత్తు ఉంది’ అనే ఆశాకిరణం ఉజ్వలంగా మెరిసింది. నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌ ‘మిస్‌మ్యాచ్‌డ్‌’ తన కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ అయింది. ప్రస్తుతం మణిరత్నం– కమల్‌హాసన్‌ సినిమాలో, ధర్మ ప్రొడక్షన్‌లాంటి పెద్ద సంస్థ సినిమాలో నటిస్తున్నాడు. ‘కలలు అనేవి పిరికి వాళ్ల కోసం కాదు. ధైర్యంగా ఉండే వ్యక్తుల కోసమే’ అంటున్న 28 సంవత్సరాల రోహిత్‌ సరాఫ్‌ ఫోర్బ్స్‌ ఇండియా ‘30 అండర్‌ 30’ జాబితాలో చోటు సాధించాడు.

చదవండి: ‘పెళ్లికాని ప్రసాద్‌’ మూవీ రివ్యూ

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)