Breaking News

నటుడికి తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు

Published on Fri, 01/13/2023 - 17:01

బాలీవుడ్ నటుడు రణదీప్ హుడాకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ఇన్‌స్పెక్టర్ అవినాష్ షూటింగ్ సమయంలో గుర్రపు స్వారీ చేస్తూ కింద  పడిపోయాడు. దీంతో వెంటనే అతన్ని ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్చారు.  ప్రస్తుతానికి అతనికి పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. నటుడి ఎడమ కాలికి గాయం కావడంతో దీనికి శస్త్రచికిత్స చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

గతంలోనూ సల్మాన్ ఖాన్‌తో రాధే  సినిమా కోసం యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు రణదీప్ గాయపడ్డాడు. అప్పుడు ఆయన కుడి కాలుకు మోకాలి శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది.

రణదీప్ నటించనున్న ప్రాజెక్ట్‌లు

రణ్‌దీప్ నటించబోయే వీర్ సావర్కర్ తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సి ఉంది. తన రాబోయే చిత్రంలోని సావర్కర్ పాత్ర కోసం రణ్‌దీప్ హుడా చాలా బరువు తగ్గాడు.  వినాయక్ దామోదర్ సావర్కర్ పాత్రకు సరిపోయేలా కఠినమైన డైట్‌ని పాటిస్తూ 22 కిలోల బరువు తగ్గారు.   ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున ఇప్పటికీ వరకు షెడ్యూల్ ప్రకటించలేదు.  చివరిసారిగా నెట్‌ఫ్లిక్స్ సిరీస్ క్యాట్‌లో కనిపించాడు. ఆ తర్వాత తేరా క్యా హోగా లవ్లీలో ఇలియానా డి'క్రూజ్‌తో కలిసి కనిపించనున్నాడు. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)