Breaking News

డైరెక్టర్‌ 'బాబీ' లవ్‌స్టోరీ గురించి తెలుసా..?

Published on Sun, 02/02/2025 - 08:57

డైరెక్టర్‌ బాబీ కొల్లిగా తెలుగు సినిమా అభిమానులకు దగ్గరయిన ఆయన అసలు పేరు కె.ఎస్.రవీంద్ర.. గుంటూరుకు చెందిన బాబీ  బి.కామ్‌లో డిగ్రి పూర్తి చేసి సినిమా మీద ఆసక్తితో హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఎలాంటి  సపోర్ట్‌ లేకుండా తన టాలెంట్‌తోనే చిత్ర పరిశ్రమలో విజయం సాధించాడు. ఏకంగా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌ వంటి సీనియర్‌ హీరోలతోనే సినిమాలు చేశాడు. రీసెంట్‌గా ‘డాకు మహారాజ్‌’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, చాలామంది బాబీ కొల్లి ఎవరు..? తన ఫ్యామిలీ ఏంటి..? విషయాలపై చర్చించుకుంటున్నారు.

ఘోస్ట్‌ రైటర్‌గా..
టాలీవుడ్‌లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా బాబీ కొల్లి పేరు తెచ్చుకున్నారు. అయితే, ఆయన మొదట ఘోస్ట్‌ రైటర్‌గా చిత్ర పరిశ్రమలో పనిచేశారు.  ఈక్రమంలో మొదటిసారి 2008 సమయంలో శ్రీహరి నటించిన హిట్‌ సినిమా 'భద్రాద్రి' కథతో బాబీ తన ప్రయాణం కొనసాగించారు. తర్వాత డాన్ శీను,బాడీగార్డ్,ఓ మై ఫ్రెండ్ వంటి చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించారు. బలుపు,అల్లుడు శీను వంటి చిత్రాలకు కథను అందించిన ఆయన తొలిసారి 2014లో రవితేజ పవర్‌ సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్‌ అందుకున్నాడు. అక్కడి నుంచి తనదైన స్టైల్లో సర్దార్ గబ్బర్ సింగ్ ,జై లవ కుశ,వెంకీ మామా,వాల్తేరు వీరయ్య,డాకు మహారాజ్    వంటి టాప్‌ సినిమాలు తెరకెక్కించాడు.

చెస్ క్రీడాకారిణి హారిక సోదరితో ప్రేమ.. పెళ్లి తర్వాత కష్టాలు
చెస్ క్రీడాకారిణి హారిక ద్రోణవల్లి అక్క అనూషను బాబీ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ దంపతులకు 2018లో ఒక కుమార్తె జన్మించింది. అయితే, గతంలో ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి బాబీ ఇలా చెప్పాడు. అనూష తన జీవితంలోకి రావడం తన అదృష్టమని బాబీ అన్నారు. 'స్కూల్‌లో చదువుతున్న సమయంలోనే తనను నేను ప్రేమించాను. ఒక సందర్భంలో నీళ్ల బాటిల్‌ షేర్‌ చేసుకోవడంతో మొదలైన మా పరిచయం ఫైనల్‌గా పెళ్లి వరకు చేరింది. అనూష స్కూల్‌ టాపర్‌.. చాలా కష్టపడి చదువుతుంది. ఇంజనీరింగ్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌గా సత్తా చాటిన ఆమె వేలూరులో ఎంటెక్‌ పూర్తి చేసింది. అక్కడ కూడా గోల్డ్‌ మెడలిస్ట్‌గానే తనేంటో ప్రూవ్‌ చేసుకుంది. అయితే, ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఆ సమయంలో ఏమీ లేని ఈ బాబీని అనూష పెళ్లి చేసుకోవాలని అనుకుంది. 

ఆమె కుటుంబం కూడా చాలా పెద్దది. అయినా కూడా ఆమె నన్ను ఇష్టపడింది. కూతురిపై ప్రేమతో ఆమె తల్లిదండ్రులు మా పెళ్లికి ఒప్పుకున్నారు. ఆ సమయంలో నేను ఘోస్ట్‌ రైటర్‌గా మాత్రమే ఉన్నాను. కనీసం స్క్రీన్‌ మీద నా పేరు కూడా పడేది కాదు. అలాంటి పరిస్థితిలో నేను ఉన్నప్పటికీ వారందరూ నన్ను నమ్మారు. హైదరాబాద్‌లో సంపాదన లేకుండా జీవించడం అంటే చాలా కష్టం. అయినప్పటికీ పెళ్లి తర్వాత చాలా కష్టాలు పడ్డాం. 

ఆమె తల్లిదండ్రులు మాకు సపోర్ట్‌ చేయాలని అనుకున్నప్పటికీ మేమే వారికి తెలిపే వాళ్లం కాదు. అలా ఇబ్బందులు మా ఇంటిలోపలి వరకే ఉంచాం. సినిమా ఛాన్స్‌ల కోసం వెతక్కుంటూనే ఎదోలా ఇంటి అద్దెలతో పాటు ఈఎంఐలు చెల్లించేవాళ్లం. అలా మొదలైన మా ప్రయాణం.. ఇప్పుడు సంతోషంగా ఉంది. ఎన్నీ మారినా అనూష మారలేదు. ఇప్పటికీ సింపుల్‌గానే ఉంటుంది. ఒక స్టార్‌ డైరెక్టర్‌ భార్య అని కూడా చెప్పుకోదు. కారు ఉన్నా కూడా పాపను స్కూటీలోనే స్కూల్‌కు తీసుకెళ్తుంది. నా జీవితానికి ఆమె ఆదర్శం' అంటూ తన భార్యపై ప్రశంసలు కురిపించాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)