Breaking News

ఓటీటీలో డార్క్ కామెడీ సినిమా

Published on Tue, 11/19/2024 - 12:20

కోలీవుడ్‌లో దాదా, స్టార్‌ వంటి సినిమాలతో పాపులర్‌ అయిన కవిన్‌ ‌  ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం బ్లడీ బెగ్గర్‌. దర్శకుడు శివబాలన్‌ ముత్తుకుమార్‌ తెరకెక్కించిన చిత్రం  దీపావళి సందర్భంగా తమిళ్‌లో విడుదలైంది. అక్కడ మంచి విజయం సాధించడంతో నవంబన్‌ 7న తెలుగులో కూడా విడుదలైంది. దాదా సినిమాతో టాలీవుడ్‌లో కూడా కాస్త గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ చిత్రాన్ని ఇక్కడ కూడా రిలీజ్‌ చేశారు. అయితే, ఈ చిత్రం తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు ప్రకటన వచ్చేసింది.

బ్లడీ బెగ్గర్ సినిమా కోసం నిర్మాత నెల్సన్‌ దిలీప్‌కుమార్‌  రూ. 5 కోట్లకు పైగానే ఖర్చు పెట్టారు. అయితే, ఈ సినిమా కేవలం తమిళ్‌లోనే సుమారు రూ. 20 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ హక్కుల్ని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా కాస్త ఎక్కువ ధరకే కొనుగోలు  చేసింది. ఈ చిత్రాన్ని నవంబరు 29 నుంచి స్ట్రీమింగ్‌కి  తీసుకురానున్నట్లు అమెజాన్ ప్రైమ్  ప్రకటించింది. తెలుగులో కూడా అదే రోజు అందుబాటులో ఉండనుంది. డార్క్ కామెడీ మూవీని చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ పేర్కొంది.

కథేంటి?
కళ్లు లేని కబోదిని బాబు, నడవలేని అభాగ్యుడిని బాబు.. అని మాయమాటలు చెప్పి డబ్బులు అడుక్కునే ఓ బిచ్చగాడు (కవిన్). వచ్చిన డబ్బులతో లైఫ్ జాలీగా గడిపేస్తుంటాడు. ఓ రోజు దినం భోజనాల కోసమని చాలామంది బిచ్చగాళ్లతో పాటు ఓ పెద్ద బంగ్లాకి వెళ్తాడు. భోజనాలు అన్నీ పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోకుండా దొంగచాటుగా బంగ్లాలోకి వెళ్తాడు. కాసేపటివరకు బాగానే ఎంజాయ్ చేస్తాడు. కానీ ఊహించని పరిస్థితుల వల్ల లోపల ఇరుక్కుపోతాడు. ఆ తర్వాత ఏమైంది? బంగ్లా యజమానులు బిచ్చగాడిని ఎందుకు చంపాలనుకున్నారు? చివరకు బతికి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీ?

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)