Breaking News

ఉపేంద్ర సతీమణిని ట్రాప్‌ చేసిన కేటుగాడు అరెస్ట్‌

Published on Wed, 11/12/2025 - 12:26

కన్నడ ప్రముఖ నటుడు ఉపేంద్ర (Upendra) దంపతుల ఫోన్స్‌ కొద్దిరోజుల క్రితం సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేసిన విషయం తెలిసిందే. ఆపై వారి పేరును ఉపయోగించి కొంత డబ్బు కూడా కొట్టేశారు.  ఈ మోసానికి పాల్పడిని వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు. బిహార్‌కు చెందిన  కుమార్‌ అనే యువకుడు పక్కా ప్లాన్‌తో ఈ నేరం చేసినట్లు గుర్తించారు. అయితే, అదే ప్రాంతంలో మరో 150 మంది యువకులు ఈ సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు కొనుగొన్నారు.

ఉపేంద్ర భార్య ప్రియాంక ఆన్‌లైన్‌లో ఒక వస్తువు ఆర్డర్ చేశారు. తర్వాత ఆమెకు ఒక కాల్‌ వచ్చింది. బుక్‌ చేసుకున్న వస్తువు  కన్ఫరమేషన్‌ కోసం  కొన్ని హ్యాష్‌ట్యాగ్స్‌, నంబర్లు ఎంటర్‌ చేస్తే డెలివరీ అవుతుందని ఫోన్‌లో చెప్పారు. వారు చెప్పినట్లు ఆమె చేయడంతో తన ఫోన్‌ వెంటనే హ్యాక్‌ అయింది. ఆ తర్వాత ఉపేంద్ర ఫోన్‌ కూడా హ్యాక్‌ అయింది. దీంతె ఆమె వాట్సాప్ సైబర్‌ కేటుగాళ్ల చేతిలోకి వెళ్లిపోయింది. ఆమె నంబర్‌ నుంచి రూ. 50 వేలు డబ్బు కావాలంటూ తన సన్నిహితులకు మెసేజ్‌ పంపారు. 

దీంతో ఆమె అభ్యర్థన నిజమైనదేనని భావించి కొందరు డబ్బు పంపారు. ఆమె కుమారుడు కూడా తన తల్లి నుండి వచ్చిన మెసేజ్‌ నమ్మి రూ. 50 వేలు బదిలీ చేశాడు. ఇలా మొత్తంగా రూ. 1.5 లక్షలు దోచేశారు. వెంటనే ఆమె గుర్తించి అప్రమత్తం కావడం ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించాను అయితే, సుమారు రెండు నెలల తర్వాత నిందితుడిని పట్టుకున్నారు.  బీహార్‌ నుంచి అతన్ని బెంగళూరుకు తీసుకొచ్చి విచారిస్తున్నారు.

Videos

Adilabad: పిడిగుద్దులతో రెచ్చిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్

జగన్ కట్టించిన ఇళ్లకు... చంద్రబాబు హంగామా

Prakash Raj: అవును.. నేను చేసింది తప్పే

మీడియాను ఘోరంగా అవమానించిన లోకేష్

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

కేతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం భారీ ర్యాలీ

మా MROలు వేస్ట్.. జనసేన నేత సంచలన కామెంట్స్

Vidadala Rajini: రాసిపెట్టుకోండి.. జగనన్న ఒకసారి చెప్పాడంటే

New Delhi: పేలుడు ఘటన బాధితులను పరామర్శించిన మోదీ

కపిలతీర్థంలో అయ్యప్ప స్వాములకు అవమానం

Photos

+5

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ లుక్‌లో సురేఖవాణి కూతురు సుప్రీత (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం..కోటి గొంతుకలతో సింహగర్జన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (ఫొటోలు)

+5

ఈ ఆలయం లో శివుడు తలక్రిందులుగా ఉంటాడు...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీ ప్రెస్‌మీట్‌లో హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ ప్రీ రిలీజ్ లో మెరిసిన చాందినీ చౌదరి (ఫొటోలు)

+5

వణికిస్తున్న చలి.. జాగ్రత్తగా ఉండాల్సిందే (ఫొటోలు)

+5

అల్లరి నరేశ్ 12ఏ రైల్వే కాలనీ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రెహమాన్ కన్సర్ట్ జ్ఞాపకాలతో మంగ్లీ (ఫొటోలు)