Breaking News

కన్నీరు పెట్టుకున్న శోభ, యావర్‌.. నేడు షో టైమింగ్స్‌లో మార్పు

Published on Sun, 10/22/2023 - 11:23

బిగ్‌ బాస్‌ సండే ఎపిసోడ్‌లో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు భారీ ఎమోషనల్‌ డ్రామాను క్రియేట్‌ చేశారు. తాజాగా హౌస్‌లోని కంటెస్టెంట్లకు దసరా కానుకగా వారి ఇంటి నుంచి లెటర్స్‌ వచ్చాయి. వాటిన చదివిన శోభ,యావర్‌,తేజ ఎక్కువ మోతాదులోనే ఎమోషనల్‌ అయ్యారు. శోభ కోసం వారి తల్లదండ్రులు ఉత్తరం రాసినట్లు అర్థం అవుతుంది. అమర్‌దీప్‌కు కూడా ఆయన భార్య ఒక ఉత్తరాన్ని పంపినట్లు తాజాగా విడుదలైన ప్రోమోలో తెలుస్తోంది.

(ఇదీ చదవండి: బూతులు బిగ్‌ బాస్‌లోనే కాదు.. బయట మరీ దారుణం..ఆమెను రేప్‌ చేస్తారంటూ)

బిగ్‌బాస్‌ హౌస్‌లో దసరా పండుగ వేడుకలు జరిగాయి. ఈ మేరకు హౌస్‌లోని కంటెస్టెంట్లతో బతకమ్మ ఆడించారు నాగ్‌.. ఆపై వారితో కొన్ని సినిమా పాటలకు డ్యాన్స్‌లు కూడా చేపించారు. దసరా సందర్భంగా నేడు సాయింత్రం 7గంటలకే షో టెలికాస్ట్‌ అవుతుందని స్టార్‌ మా ప్రకటించింది. దీంతో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను ఏర్పాటు చేశారు. పలు రియాల్టీ షోలలో పాల్గొన్న యంగ్‌ సింగర్స్‌ స్టేజీపైన పాటలు పాడారు. ఆపై డింపుల్ హయాతి తన డ్యాన్స్‌తో దుమ్ములేపింది.

శోభ కంటతడి
ఫ్యామిలీ నుంచి వచ్చిన లెటర్‌ చదివిన శోభ మొదటిసారి ఎమోషనల్‌ అయింది. ఆ లేఖను ఆమె నాన్నగారు రాసినట్లు తెలుస్తోంది. అందులో ఆయన తెలిపిన వ్యాఖ్యలతో ఆమె కన్నీరు పెట్టింది. ఆటలో బాగా కొనసాగుతున్నావని లేఖలో ఆమె తండ్రి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా శోభ వల్ల తమ కుటుంబానికి మంచి గుర్తింపు వచ్చిందని ఆయన తెలపాడు. మరోవైపు యావర్‌ ఒక టాస్క్‌లో లేఖను కోల్పాయాడు. ఇప్పుడు మళ్లీ తన ఫ్యామిలీ నుంచి లేఖ రావడం.. అది చదివిన యావర్‌ కంటతడి పెట్టాడు.

ప్రోమో చివర్లో గత వారం రీ ఎంట్రీ కోసం వారు వేసిన ఓట్ల బ్యాలెట్‌ బాక్స్‌ను నాగ్‌ తెచ్చారు. కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తి అయిందని ఆయన తెలిపారు. రీ ఎంట్రీ అవకాశం దక్కించుకున్న కంటెస్టెంట్‌ నేడు హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలిపారు. రీ ఎంట్రీ అవకాశం దాదాపు 'రతికా రోజ్‌'కు దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వారంలో 'పూజా' ఎలిమినేషన్‌ అయినట్లు తెలుస్తోంది. కానీ నో ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ ఇస్తే చెప్పలేం.

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)