Breaking News

షో అయిపోగానే కావ్య దగ్గర వాలిపోతానన్న నిఖిల్‌.. ఇప్పుడేమో!

Published on Mon, 12/16/2024 - 17:09

బిగ్‌బాస్‌ 8 ట్రోఫీ గెలిచిన నిఖిల్‌ చాలా సెన్సిటివ్‌. చిన్నచిన్న విషయాలకే ఎమోషనలైపోయి కంటతడి పెట్టుకుంటుంటాడు. హౌస్‌లో అందరితోనూ కలిసిమెలిసి ఉండేవాడు. ముఖ్యంగా మొదట్లో సోనియాతో, తర్వాత యష్మితో ఎక్కువ క్లోజ్‌ అయ్యాడు. కానీ ఒకానొక సందర్భంలో తను సింగిల్‌ కాదంటూ లవ్‌స్టోరీ బయటపెట్టాడు.

హౌస్‌లో కన్నీళ్లు
సీరియల్‌ నటి కావ్యతో ప్రేమలో ఉన్న విషయాన్ని ఆమె పేరు చెప్పకుండానే వెల్లడించాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు తనే నా భార్య అని తెలిసిపోయింది. నా అన్ని బ్రేకప్‌లను ఆమె మర్చిపోయేలా చేసింది. మా ప్రేమకు ఆరేళ్లు. మేము విడిపోయామా? అంటే నేనైతే ఆ ఎమోషనల్‌ బంధం నుంచి బయటకు రాలేదు. భవిష్యత్తులోనూ తనతోనే కలిసుంటా.. తనే నా భార్య అని ఫిక్సయిపోయా! షో అయిపోగానే తన దగ్గరికే వెళ్తాను. 

యూటర్న్‌?
ఆమె కోప్పడుతుందని తెలుసు. అయినా వెళ్తా.. తిడితే పడతాను, కొడితే కొట్టించుకుంటాను.. పిచ్చి లేస్తే లేపుకెళ్లిపోతా.. షో అయిపోగానే నీ ముందు నిలబడతా.. అంటూ కావ్యపై ఉన్న ప్రేమను చెప్తూ ఏడ్చేశాడు. తాజాగా బిగ్‌బాస్‌ బజ్‌లో అడుగుపెట్టిన నిఖిల్‌ను యాంకర్‌ అర్జున్‌ అంబటి ఇదే ప్రశ్న అడిగాడు. ట్రోఫీ గెలవగానే డైరెక్ట్‌గా తన దగ్గరకే వెళ్తానన్నావు.. మరి వెళ్తున్నావా? అని ప్రశ్నించాడు. 

ఆలస్యంగానైనా..
అందుకు నిఖిల్‌ బయటకు వెళ్లేదాక తెలియదు పరిస్థితి! అని చెప్పాడు. అప్పుడేమో వెంటనే వెళ్తానని ఇప్పుడేమో పరిస్థితులు చూసి చెప్తానంటున్నాడేంటని నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. అయితే ఆలస్యంగానైనా నిఖిల్‌.. కావ్య దగ్గరకు వెళ్లి తన ప్రేమను నిలబెట్టుకుంటాడేమో చూడాలి!

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)